Site icon NTV Telugu

Revanth Reddy: రాహుల్ కి రెండేళ్ల జైలు శిక్ష.. షాక్ లో ఉన్నానన్న రేవంత్ రెడ్డి

Revanth Reddy: ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి సూరత్ కోర్ట్ 2 ఏళ్ల జైల్ శిక్ష విధించడం షాక్ కు గురిచేసిందని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అక్కడ బీజేపీ.. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయని మండిపడ్డారు. టీఎస్పీఎస్సిలో జరిగిన పేపర్ లీక్ ల కుంభకోణంలో నేను సాక్షిగా వెళుతున్న సమయంలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను, హౌస్ అరెస్టులు, గృహ నిర్బందాలు చేయడం ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలన్నారు. కేసీఆర్ ఖమ్మం, మహబూబా బాద్ జిల్లాలలో పర్యటించి పాడైన పంటలను పరిశీలించేందుకు వెళ్తుంటే ఆయా జిల్లాల నాయకులను అరెస్టులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Breast Feeding: పిల్లలకు పాలిచ్చేటప్పుడు ఫోన్ వాడడం ఎంత డేంజరో తెలుసా ?

దేశంలో, రాష్ట్రంలో ఇంతటి నిర్బంధం ఏమిటి? అని ప్రశ్నించారు. మనం ఎక్కడ ఉన్నాం.. ఇంతటి నియంత పాలనను ఎంతకాలం భరిద్దామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలు లేకుండా పాలన సాగుతున్న బీజేపీ, బీఆర్ఎస్ లపై తిరగబడక తప్పదన్నారు. రాహుల్ గాంధీ 2019 పార్లమెంట్ ఎన్నికల సభలో మాట్లాడిన ఒక రాజకీయ ప్రకటన ను ఆసరా చేసుకొని మోడీ ప్రభుత్వం ఆయనపై పరువు నష్టమ్ దావా వేసి కుట్రలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ కుటుంభం ఇలాంటి వాటికి భయపడదన్నారు.

Read also: Pregnancy: ప్రెగ్నెన్సీ రాకుండా కొత్త సాధనం.. తెలుగు రాష్ట్రాల్లో అమలు..?

సంపన్న కుటుంబం, విలాసవంతమైన జీవితాన్ని పక్కన పెట్టి దేశం కోసం బ్రిటిష్ పైన పోరాటం చేసి ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గి దేశానికి స్వేచ్ఛ తెచ్చిన కుటుంభం.. ఈ మోడీ లకు భయపడదని అన్నారు. దేశం కోసం రాహుల్ గాంధీ తాత నెహ్రు పోరాటం చేసి జైల్ కు నాయనమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీ దేశం కోసం దేహాన్ని ముక్కులు చేసిన భయపడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి రాహుల్ గాంధీ మోడీ బెదిరింపులకు భయపడదన్నారు. రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో సూరత్ కోర్ట్ వేసిన రెండేళ్ల శిక్షపైన ఉన్నత కోర్టులకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామన్నారు. దేశం కోసం, ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు.
Congress leaders: కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్ట్.. కారణం ఇదీ…

Exit mobile version