తెలంగాణలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలపై ఉన్నతాధికారులతో నిన్న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు పలు సూచనలు చేశారు. ఆ తరువాత విపక్షాలపై విమర్శలు గుప్పించారు. అయితే తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.. ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కుంటున్నారు.. ప్రభుత్వం తక్షణమే మేల్కొని..జిల్లాల వారీగా మంత్రులకు బాధ్యతలు ఇస్తారు.. ప్రజలకు ఇబ్బంది లేకుండా.. అస్తి నష్టం లేకుండా చూడాలి.. కానీ.. ఇవన్నీ మర్చిపోయారు సీఎం కేసీఆర్.. కేవలం.. మూడు నిమిషాలు మాట్లాడి వదిలేశారంటూ విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. నిన్న ఏకపాత్రాభినయం చూశామని, దుర్యోధన, దుశ్శాసన పాత్రలు రక్తి కట్టించినట్టు ఉందంటూ ఆయన సెటైర్లు వేశారు. కేసీఆర్‌నీ దుర్యోధనుడు సోకినట్టు ఉన్నాడని, కేసీఆర్‌కి ఎవరైనా పాఠం చెప్పినరో .. దేశపతి లాంటి వాళ్ళు రసించినట్టు ఉందన్నారు.
అంతేకాకుండా.. కేసీఆర్ చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా.. మోడీ దుర్మార్గుడు నిజమే.. మోడీ దుర్యోధనుడు ప్రజా స్వామ్యం కి ప్రమాదం.. మోడీ కుల గురువు…ఆదర్శం నువ్వే కదా.. ఏకనాథ్ షిండేల ఉత్పత్తి ప్రారంభించింది కేసీఆర్ కదా.. శ్రీనును నీ పార్టీ కాకున్నా మంత్రిని చేసింది నువ్వే కదా.. విషపురుగులు తయారు చేసి ఊరు మీదికి తెచ్చింది నువ్వే.. అంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి…సబితా లాంటి ఏక్‌నాథ్ షిండేలను తయారు చేసిందే నువ్వు కాదా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు నువ్వు షిండేల గురించి మాట్లాడుతున్నావు.. నీవరకు వస్తే కానీ తెలియ లేదా..? రాజీవ్ గాంధీ నుండి మొదలుకొని వాజ్ పాయ్ వరకు పార్టీ ఫిరాయింపులు నివారించారు. మోడీ.. నువ్వు ఏం చేశావు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నీ .. సీపీఐ నుండి ఎన్నిక అయిన రవీంద్ర నాయక్ ను పార్టీ లో కలుపుకున్న ది నువ్వే కాదా..? ఎర్ర జెండాకు కూడా తుప్పు పట్టించినది నువ్వే కదా కేసీఆర్ అంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.