NTV Telugu Site icon

Revanth Reddy: తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే సీతక్క సీఎం..! రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా సీతక్క బరిలోకి దిగనున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అమెరికాలో జరిగిన తానా సభల్లో రేవంత్ పాల్గొన్నారు. తెలంగాణతో పాటు ఏపీ రాజకీయాలపై ఆయన స్పందించారు. అమరావతి..పోలవరం తామే నిర్మిస్తామని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ అంటే కాంగ్రెస్..కాంగ్రెస్ అంటే రేవంత్ అని అన్నారు. ఇప్పుడు రేవంత్ వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. అమెరికాలో జరిగిన తానా సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను నిర్వాహకులు సన్మానించారు. చాలా ప్రశ్నలు అడిగారు. ఈ సందర్భంగా రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వీ రమణ వంటి తెలుగు ప్రముఖులు ఉన్నపుడు అక్కడ ఉన్నారని నమ్మేవారని అన్నారు. ఇప్పుడు ఢిల్లీలో తెలుగు వారికి అవకాశం లేదు. అదే సమయంలో తానా వద్ద ఉన్న వారు రేవంత్‌ను పలు ప్రశ్నలు సంధించారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ఇప్పటికే చెప్పారని.. అదే ప్రస్తావిస్తున్నారని స్పష్టం చేశారు.

Read also: Jaggareddy: ఆలయ అభివృద్ధికి రూ. వెయ్యి కోట్లు అవసరం..సీఎం కేసీఆర్‌కు లేఖ రాస్తా..!

అదే సమయంలో దళితులు, ఆదివాసీలకు సీఎం అయ్యే అవకాశం లేదా అని రేవంత్‌ను ప్రశ్నించారు. దీనికి రేవంత్ చెప్పిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ప్రకటించదని అన్నారు. అవసరమైతే పార్టీ సీతక్కన్‌ను కూడా ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న దళిత నేత మల్లికార్జున ఖర్గే ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారని గుర్తు చేశారు. ప్రజల కోసం ఏదైనా చేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. రేవంత్ పట్ల కాంగ్రెస్ భిన్నంగా వ్యవహరించవద్దని రేవంత్ కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ రేవంత్ అని..రేవంత్ కాంగ్రెస్ అని అన్నారు. ఎన్టీఆర్ ఏకలవ్యకు చాలా మంది శిష్యులు ఉన్నారని..ఇప్పుడు అన్ని పార్టీల్లో ఉన్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్ అని కొనియాడారు. రేవంత్ రెడ్డి తానా సభల్లో ఎన్టీఆర్ పేరు చెప్పగానే అనూహ్య స్పందన కనిపించింది. తానా సమావేశాలకు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. అమరావతి ప్రస్తావన వచ్చినప్పుడు కూడా ఎన్నారైల నుంచి మద్దతు లభించింది. సీతక్కను సీఎం చేస్తానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో కొత్త రాజకీయ చర్చకు కారణమవుతున్నాయి.
Rajasthan: భర్త ఉద్యోగం కోసం ఇద్దరు భార్యల మధ్య గొడవ.. ఒకరి దారుణ హత్య