NTV Telugu Site icon

Revanth Reddy: రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ

Revanth

Revanth

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ పార్టీలకు సూచనలు చేశారు. మీ పార్టీలు గెలవాలన్న.. రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టండి అన్నారు రేవంత్. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి.. పతనం అయ్యాడు. రెడ్లకు అవకాశం ఇవ్వండి.. రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తా. దానికి ఉదాహరణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు.

రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు… నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రం లో అధికారంలోకి వచ్చింది పార్టీ. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారు రేవంత్. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు బలహీన వర్గాలకు దూరం అవ్వడమే. రెడ్లు సీఎం, ప్రధాని..రాష్ట్రపతిని బీసీ, ఎస్సీ వర్గాలు చేశాయంటే మనమీద వారికి వుండే నమ్మకమే కారణం అన్నారు.

వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నాం. రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దన్నారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి.. పద్మనాయకులను దగ్గరికి తీశాడు. పద్మ నాయకులు అంటే వెలమలు. రెడ్లను పక్కన పెట్టి..వెలమలు దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలి పోయింది. ఆనాటి నుండి..ఈనాటి వరకు..రెడ్లకు.. వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి.
Rich Persons List: బ్రిటన్‌ శ్రీమంతుల జాబితాలో భారతీయులు

Show comments