Site icon NTV Telugu

Revanth Reddy: బీజేపీ రూ.5వేల కోట్లు కేటాయిస్తే మునుగోడు సమస్యలు తీరుతాయి

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: మునుగోడు ఉప ఎన్నిక కు బీజేపీ 5 వేల కోట్లు కేటాయిస్తే అక్కడి సమస్యలు తీరుతాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా సమస్యల ప్రాతిపదికన జరగాల్సిన చర్చ వ్యక్తిగత విమర్శలు దారితీస్తుందని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ వల్ల గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని మండిపడ్డారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కానీ.. పార్లమెంట్ లో నేను అడిగిన ప్రశ్నకు 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.

మునుగోడు ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ బయలుదేరాడుని విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్, ఇంటికో ఉద్యోగం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి ఓటు అడిగే హక్కు లేదని మండిపడ్డారు. ప్రజల పక్షాన ఈ రెండు పార్టీలను ప్రశ్నించే హక్కు కాంగ్రెస్కి ఉందని రేవంత్‌ తెలిపారు. కాంగ్రెస్ పక్షాన పేదలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. సమస్యలపై చర్చ జరగాలని కానీ.. వ్యక్తిగత విమర్శలు కాదని అన్నారు రేవంత్‌. కాంగ్రెస్ శ్రేణులకు సూచన పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట రైల్వే కోచ్, ట్రిపుల్ ఐటీ, జాతీయ హోదా.. సాగునీటి ప్రాజెక్టులు కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపై మనం పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. బీజేపీ వైఫల్యాలు ఎండగట్టాలని అన్నారు . మనతో పాటు కమ్మునిస్ట్ లు, కోదండరాం తో సమన్వయం చేసుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై పోరాడదామని పిలుపు నిచ్చారు.
Rain in Several Places in Hyderabad: మేఘావృతమైన ఆకాశం.. పలు ప్రాంతాల్లో జల్లులు

Exit mobile version