NTV Telugu Site icon

Revanth reddy: కొనసాగుతున్న రేవంత్ రెడ్డి పాదయాత్ర.. నేడు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో..

Revanthreddy

Revanthreddy

Revanth reddy: తెలంగాణా రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చెయ్యటానికి కాంగ్రెస్ పార్టీ సరికొత్త కార్యక్రమంలో ముందుకు పోతుంది. ఈనేపథ్యంలో.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్ర 25వరోజుకు చేరింది. ఈరోజు కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో యాత్ర ఫర్ చేంజ్ పాదయాత్ర కొనసాగనుంది. ఉదయం 9 గంటలకు ముత్యంపేటలోని షుగర్ ఫ్యాక్టరీ సందర్శించనున్నారు రేవంత్‌. ఉదయం 11:30 గంటలకు మెట్ పల్లి పసుపు మార్కెట్ సందర్శిస్తారు. మధ్యాహ్నం 1:00 గంటలకు ముత్యంపేట యాత్ర క్యాంపులో భోజన విరామం అనంతరం సాయంత్రం 4:00 గంటలకు ధర్మారంలో పార్టీ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఐలాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలించనున్నారు రేవంత్‌ రెడ్డి . అనంతరం ఐలాపూర్ నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. అక్కడి నుంచి ఐలాపూర్ నుంచి కిషన్ రావుపల్లి మీదుగా యాత్ర కోరుట్ల చేరుకోనుంది. ఇక రాత్రి 7 గంటలకు కోరుట్ల అంబేద్కర్ సర్కిల్ లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో రేవంత్‌ మాట్లాడనున్నారు. బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమ్మర్ పల్లిలో రాత్రి బస చేయనున్నారు రేవంత్‌ రెడ్డి.

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ సమస్యల నుంచి ప్రజలను విముక్తి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ధరణి అదాలత్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌తో ప్రాణాలు కోల్పోయిన సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన 32 మందికి కాంగ్రెస్ నాయకులు హామీ కార్డులను అందజేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత 100 రోజుల్లో వారి సమస్యలు పరిష్కరించి వారి భూములు వారికి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని నాయకులు బాధితులకు హామీ ఇచ్చారు.
Father Gets Daughter Pregnant: కూతురిని గర్భవతిని చేసిన తండ్రి.. కోర్టు సంచలన శిక్ష

Show comments