Revanth Reddy once again criticized komatireddy rajgopal reddy
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వీడిపోకుండా ఉండేందుకు సీనియర్‌లు బుజ్జగింపులు ఫలిచలేదు. అయితే.. రాజగోపాల్ రెడ్డి పార్టీ వీడటంపై ఇప్పటికే టీపీసీసీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని పదవులు అనుభవించి.. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి వదిలిపోయారంటూ విమర్శలు గుప్పించారు. అయితే.. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే.. ఈ క్రమంలో.. ఏఐసీసీ కార్యదర్శులకు నియోజక వర్గాల అప్పగించారు.
కొత్తగా రాష్ట్రంకి వచ్చిన ఏఐసీసీ కార్యదర్శులు జావిద్, రోహిత్ చౌదరి నియోజక వర్గాల కేటాయించారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలతో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతల సమావేశం కొనసాగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలో.. రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఆర్జీ పాల్ అని పిలవాలన్నారు. అట్లా కాదని ఎవరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని పిలిచినా షోకాజ్ నోటీసులు ఇస్తామని వెల్లడించారు. సభలు… సమావేశాల్లో కూడా ఆర్జీ పాల్ అనే పిలవాలి అని ఆదేశించారు రేవంత్ రెడ్డి. ఏపీ లో కేఏ పాల్… తెలంగాణ లో ఆర్జీ పాల్ అంటూ సమావేశం లో ఆదేశాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి.
