Revanth Reddy On Errabelli Dayakar Rao: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఓనమాలు, ఏబీసీడీలు కూడా రాయని ఎర్రబెల్లి మంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. ఎర్రబెల్లి ఓనమాలు, ఏబీసీడీలు రాస్తే.. తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, ఈ పాలకుర్తి గడ్డ మీద సవాల్ చేస్తున్నానని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండి, బీఆర్ఎస్‌తో కోవర్ట్ అయ్యి.. ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచాడని ఆరోపించారు. తెలంగాణ గడ్డ మీద టీడీపీ లేకుండా చేశాడని విమర్శించారు. ఎర్రబెల్లి పచ్చిమోసగాడని, రాజకీయ భిక్ష పెట్టిన టీడీపీని కోవర్ట్ ఆపరేషన్ చేసి నాశనం చేశాడన్నారు. ఎర్రబెల్లి ఏదో ఒక రోజు కేసీఆర్‌ను కూడా మోసం చేస్తాడని, కేసీఆర్ నిద్రపోయినప్పుడు ఆయనకు తెలియకుండానే కిడ్నీలు అమ్ముకునే తత్వం ఎర్రబెల్లిదని విమర్శించారు. ధరణిని అడ్డం పెట్టుకొని, ఎర్రబెల్లి భూములను ఆక్రమించుకుంటున్నారని ఆరోపించారు.
Valentines Day Special: రెడ్ హాట్ బ్యూటీస్.. తీసుకోండి మా హార్ట్స్
పాలకుర్తికి గొప్ప చరిత్ర ఉందన్న రేవంత్ రెడ్డి.. ఈ గడ్డ భాగవతం రాసిన పోతనది, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మది, దొడ్డి కొమురయ్యలది అని పేర్కొన్నారు. పాలకుర్తిలో రాజీవ్ విగ్రహాన్ని తీయాలని కుట్ర జరుగుతుంది, రాజీవ్ విగ్రహాన్ని ముట్టుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఇల్లు లేని వారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తామని మాటిచ్చారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు ఇస్తామని, రూ.500 వందలకే సిలిండర్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటుందని హామీలిచ్చారు. రూ.5 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ కూడా చెల్లిస్తామని, ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.5 లక్షలకు పెంచుతామని అన్నారు. పాలకుర్తిలో కాంగ్రెస్ గెలవాలని, ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు. తెలంగాణ తెచ్చిన వాళ్లకు రెండుసార్లు అవకాశం ఇచ్చారని, మరి ఇచ్చినవారికి ఓ అవకాశం ఇవ్వాలని ప్రజల్ని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను 100 సీట్లతో గెలిపించాలన్నారు.
INDW vs WIW: వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు