CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, అంతర్జాతీయ పెట్టుబడుల ప్రోత్సాహం దిశగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరుస సమావేశాలు నిర్వహించారు. కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ బృందం ఆయనను కలిసింది. ఈ భేటీలో ఐటీ, ఫార్మా, ఏరోస్పేస్, డిఫెన్స్ మరియు అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో కెనడాతో భాగస్వామ్యం గురించి విస్తృతంగా చర్చించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుల వివరాలను సీఎం రేవంత్‌రెడ్డి కెనడా ప్రతినిధులకు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని తెలియజేస్తూ, కెనడా సంస్థలు స్టార్టప్స్, ఎడ్యుకేషన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లలో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. అదే విధంగా, ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం కూడా సీఎం రేవంత్‌రెడ్డిని కలిసింది.
హైదరాబాద్‌లో ఇప్పటికే అమలవుతున్న ఫ్రాన్స్ ప్రాజెక్టుల పురోగతిపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. అలాగే, ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని బలోపేతం చేసి, ఫ్రాన్స్-తెలంగాణ మధ్య సహకారాన్ని మరింత విస్తరించాలని సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Upcoming Bikes: నవంబర్ 2025లో విడుదల కానున్న బైక్స్ ఇవే.. రెండు యమహా బైక్‌లు కూడా..
