Site icon NTV Telugu

Revanth Reddy : పాలాభిషేకం చేసే వాళ్ళకి పిచ్చి ముదిరింది

TPCC President Revanth Reddy fired on CM KCR Job Notification.

గత సోమవారం తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే నేడు మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో 91వేల పై చిలుకు ఉద్యోగాలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్‌ కార్యకర్తలు తదితరులు కేసీఆర్‌ చిత్రపటానికి పాలభిషేకాలు, నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. అయితే దీనిపై టీపీసీసీ రేవంత్‌ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


పాలాభిషేకం చేసే వాళ్ళకి పిచ్చి ముదిరిందని ఆయన అన్నారు. కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన మాత్రమే చేసాడు.. నోటిఫికేషన్ లు ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను మరొక సారి మోసం చేసాడని, 91 వేలకు ఉద్యోగాలు ను కుదించి లక్ష ఉద్యోగాలు మోసం చేసాడన్నారు. మేము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపు 2 లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పీ కె ఇచ్చిన అబద్ధాలు ప్రకటన ను కేసీఆర్ చదివాడు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

Exit mobile version