NTV Telugu Site icon

Revanth Reddy : కేసీఆర్ అవినీతికి కాళేశ్వరం బలైపోయింది..

Tpcc Chief Revanth Reddy

Tpcc Chief Revanth Reddy

TPCC President Revanth Reddy Made Comments On Telangana Chief Minister K.Chandrashekar Rao.

తెలంగాణలో కురిసిన భారీ వర్షాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. 10 రోజులుగా అత్యధిక వర్షపాతం నమోదు అయి గోదావరి ఉదృతం గా ప్రవహిస్తుంది. వర్షకాలం వస్తున్నప్పుడు మే నెలలోనే ఆయా శాఖలతో ,మంత్రులతో సీఎం సమీక్ష చేయాల్సింది.. గతంలో ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి నిరంతరం ముఖ్యమంత్రులు పర్యవేక్షించేది.. వ్యాధులు రాకుండా వైద్య ఆరోగ్య శాఖ ,డిజాస్టర్ సమయంలో విపత్తు బృందాలను అప్రమత్తం చేసేది.. కేసీఆర్ సమీక్ష చేసినప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ను కానీ డిజాస్టర్ బృందాలను ,ఆయా అధికారులను పిలవకుండా పార్టీ ఫిరాయింపులపై సమీక్ష చేసాడు.. పక్క రాష్ట్ర నేతలకు ఫోన్ చేసి జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర పై మాట్లాడాడు.. సింగరేణి ఉద్యోగులు ఇతరులను కాపాడబోయి ఇద్దరు మరణించారు… కనీసం వారికి సంతాపం కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయలేదు.. వరదలు వచ్చే 20 నియోజకవర్గల్లో మీకు ఉన్న మంత్రులను ,ఆయా శాఖ అధికారులను అలెర్ట్ చేయాలని సూచించం.. అవసరాలు తీర్చే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించం.. రీడిజైన్ పేరుతో లక్ష కోట్లకు పైగా ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు.. ఎక్కడికక్కడ మోటార్లు మునిగిపోయాయి… అవి మళ్ళీ పని చేస్తాయని నమ్మకం లేదు.. కోట్లు అవినీతి జరిగింది.. కేసీఆర్ అవినీతి కి కాళేశ్వరం బలైపోయింది..

 

Revanth Reddy On Floods : మానవత్వం లేని వ్యక్తి కేసీఆర్..

వరదలు వచ్చినప్పుడు మోటార్లు మునుగుతాయి అని పెంటారెడ్డి అంటున్నాడు.. మేము నాగార్జున సాగర్, శ్రీశైలం మునిగాయా.. నిపుణుల పేరుతో అవినీతి కి తెరలేపారు.. ప్రజలు కోటుకుపోయి చచ్చిపోతుంటే ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు.. బాసర ట్రిపుల్ ఐటీ లో కలుషితమైన తిండి వల్ల 800 మంది బారిన పడ్డారు.. వారిని ఇంత వరకు పరమర్శించలేదు.. ప్రభుత్వ దోపిడీ కి వందలాదిమంది విద్యార్థులు బలవుతున్నారు… ప్రాజెక్టులు మునిగిన ,తెగిన వేల కోట్ల ప్రాజెక్టులు పోయిన పట్టింపు లేదు..11 లక్షల ఎకరాల్లో పంట మునిగిపోయింది.. సర్వేలు అన్ని మీకు సగమే చెబుతున్నాయి..వంద స్థానాల్లో సగం అంటే మీరు సగం సచ్చినట్టే… 18 నెలల తరువాత జరిగే ఎన్నికల మీద ఇప్పుడే మాట్లాడుతున్నావ్.. తెలంగాణ రాష్ట్రాన్ని తండ్రీ కొడుకులు సర్వ నాశనం చేశారు.. నేషనల్ డిజాస్టర్ బృందలను పంపించాలని ప్రధాని కి కాంగ్రెస్ లేఖ రాసింది.. పంట నష్టపరిహారం చెల్లించాలి.

 

ఇసుక దోపిడీ వల్లే భద్రాచలం మునిగిపోయింది.. వరదలకు కారణం కేసీఆర్ కుటుంబం ఇసుక దోపిడీ వల్లే.. వరదల్లో ప్రజలు,పశువులు ఆస్తులు కొట్టుకుపోతుంటే జాతీయ రాజకీయాల పై సమీక్ష చేస్తున్నారు.. ఈ దరిద్రం ఉన్నంత వరకు తెలంగాణ కు పట్టిన పీడ పోదు.. కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రజలకు అండగా నిలబడుతుంది.. జాతీయ విపత్తుగా గుర్తించి తక్షణమే 2 వేల కోట్లు రిలీజ్ చేయాలని మోడీ కి డిమాండ్ చేస్తున్న.. బండి సంజయ్ ,కిషన్ రెడ్డి తక్షణమే మోడీ దగ్గర జాతీయ విపత్తుగా గుర్తుంచి 2 వేల కోట్లు విడుదల చేపించాలి.. ప్రతి కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలి.. కాళేశ్వరంలో జరిగిన అవినీతి పై విచారణ జరిపించాలని.. లేదంటే కేసీఆర్ ఇచ్చిన కమీషన్ ల వల్లే బీజేపీ జాతీయ సమావేశాలు జరిగాయని నమ్ముతామన్నారు రేవంత్‌ రెడ్డి.