Site icon NTV Telugu

Congress: వరంగల్‌ పర్యటనకు రేవంత్, కోమటిరెడ్డి, మధు యాష్కీ..

తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన రాహుల్‌ గాంధీ.. త్వరలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోపర్యటించనున్నారు.. ఆయన పర్యటనలో వరంగల్‌ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది కాంగ్రెస్‌ పార్టీ.. ఇక, రాహుల్‌ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టి.పీసీసీ.. ఏర్పాట్లపై దృష్టిసారించిది.. అందులో భాగంగా.. ఈ నెల 22న వరంగల్‌లో పర్యటించనున్నారు పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి, స్టార్ కంపెయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మరియు ముఖ్య నాయకులు.. 22న ఉదయం 11 గంటలకు ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో మే 6న జరగనున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సభాస్థలి (రైతు సంఘర్షణ సభ) పరిశీలించనున్నారు.. రాహుల్ గాంధీ సభ విజయవంతానికి క్షేత్ర స్థాయిలో పర్యటించనున్నారు.. సభా స్థలి పరిశీలన అనంతరం వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులతో సభ విజయవంతానికి సమీక్ష నిర్వహించనున్నారు.

Read Also: Sri Lanka Economic Crisis: మరింత పెరిగిన పెట్రో ధరలు.. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు

మరోవైపు.. ఈ నెల 21న ఉదయం 11 గంటలకు ఖమ్మంలో జిల్లా నాయకులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించబోతున్నారు… ఖమ్మం ఉమ్మడి జిల్లా నాయకులతో వరంగల్‌లో జరగనున్న రాహుల్ గాంధీ సమీక్ష నిర్వహించబోతున్నారు.. సభ విజయవంతం చేసేందుకు కృషి చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వనున్నారు. ఇక, 23న మధ్యాహ్నం 3 గంటలకు గాంధీభవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగబోతోంది… టీపీసీసీ, పీఏసీ, డీసీసీ, అనుబంధ సంఘాలు, అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గ కో ఆర్డినెటర్లు, ఇతర ముఖ్య నాయకులతో సమావేశం జరగనుంది. మొత్తంగా రాహుల్‌ గాంధీ సభ విజయవంతం చేయడం.. పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపే విధంగా ముందుకు సాగుతున్నారు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.

Exit mobile version