Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Revanth Reddy Kaleshwaram Temple Development Medigadda Barrage Visit

CM Revanth Reddy : కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు.. సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్.!

Published Date :April 20, 2026 , 6:17 pm
By Gogikar Sai Krishna
  • కాళేశ్వర స్వామి దర్శనం
  • అభివృద్ధి పనులకు భూమి పూజ
  • మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలన
  • రాజకీయంగా కీలక పర్యటన
CM Revanth Reddy : కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు.. సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్.!
  • Follow Us :
  • google news
  • dailyhunt

జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి , మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ పనులపై ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. కాళేశ్వరం చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. రేవంత్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, ఆలయ ప్రాంగణంలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. భక్తుల సౌకర్యార్థం కాళేశ్వరం క్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వం సూచనప్రాయంగా వెల్లడించింది.

VDxSHOURYUV : రౌడీ స్టార్ కోసం నేచురల్ స్టార్..విజయ్-నాని సందడి!

ఆలయ దర్శనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. గత కొంతకాలంగా వివాదాస్పదంగా మారిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు, ప్రస్తుత స్థితిగతులు , పునరుద్ధరణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. బ్యారేజ్ మరమ్మత్తులు ఎంతవరకు వచ్చాయి, వర్షాకాలం లోపు చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గత ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలో, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డను సందర్శించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రాజెక్టు భద్రత , భవిష్యత్తు కార్యాచరణపై ఈ పర్యటన ద్వారా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు , ఉన్నతాధికారులు ఈ పర్యటనలో ముఖ్యమంత్రి వెంట ఉన్నారు.

Virat Kohli: కంఠీలు ధరించి, తిలకాలు పెట్టుకుని.. ప్రేమానంద మహారాజ్ వద్ద విరాట్-అనుష్క

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Visit
  • Kaleshwaram project
  • Kaleshwaram Temple
  • medigadda barrage
  • political news

తాజావార్తలు

  • CM Revanth Reddy : కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు.. సీఎం రేవంత్ ఫుల్ ఫోకస్.!

  • Kolkata Knight Riders: 7 మ్యాచ్ లలో 1 విజయం.. KKR ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుందా? రెస్ట్ ఆఫ్ సీజన్ సీనారియోలు

  • Stock Market: స్టాక్ మార్కెట్‌లో రక్త కన్నీరు.. ఒక్క రోజులో రూ.71 వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి!

  • Airtel: యూజర్లకు షాకిచ్చిన ఎయిర్ టెల్.. ఆ పాపులర్ ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు

  • Ambati Rambabu: రాజధానిని నిర్మించే స్థాయిలో ఏపీ ఉందా..? అమరావతిపై అంబటి సంచలన వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Body Odor: చెమట వాసనతో ఇబ్బంది.? డియోడ్రెంట్ కాదు.. ఈ ఒక్క ‘పటిక’ చాలు.!

  • Ajith Kumar: బెల్జియం రేసు పోడియంపై రెపరెపలాడిన భారత జెండా.. హీరో అజిత్ సెలెబ్రేషన్స్ మాములుగా లేవుగా..!

  • ఇంట్లోనే థియేటర్ ఫీలింగ్.. Dolby Atmos సౌండ్‌, REGZA టెక్నాలజీతో కొత్త Toshiba Z670SP MiniLED 4K టీవీలు లాంచ్..!

  • 8.18mm స్లిమ్‌, 120Hz డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో TECNO POP X 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Video Viral: అధ్వాన్నంగా మారిన రోడ్ల దుస్థితి.. వినూత్నంగా స్పందించిన యంగ్ బిజినెస్ మ్యాన్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions