Site icon NTV Telugu

Revanth Reddy: 31న సిలిండర్లకు దండలేసి డప్పు చాటింపు

కరోనాతో కూలీలు ఉపాధి కోల్పోయారు. పేదలకు సాయం అందించడం మానేసి జేబు దొంగల మాదిరిగా దోచుకుంటున్నారని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వాలు..పెట్రో ధరలు విపరీతంగా పెంచుతుంది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఒకరి తప్పు..ఇంకొకరు కప్పి పుచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడ బలుక్కొని పేదల్ని దోచుకుంటున్నాయి.

విద్యుత్ చార్జీలు పెంచడంతో 5 వేల కోట్లు.. సర్ చార్జి పేరుతో మరో అరు వేల కోట్లు దోచుకుంటున్నదన్నారు రేవంత్. ఈఆర్సీ ముందు నా వాదన వినిపించిన పెడ చెవిన పెట్టింది. విద్యుత్ సంస్థలు ఆర్దికంగా దెబ్బతిన దానికి ప్రభుత్వ విధానమే కారణం. సంక్షేమ పథకాలు ఇస్తున్నాం అంటూనే విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులు ఇవ్వక పోవడంతో 12,500 కోట్లు బకాయి పడ్డాయన్నారు.

ప్రభుత్వ పెద్దలు కొందరు బిల్లులు ఎగవేతతో 6 వేల కోట్లు నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం సబ్సిడీ లు చెల్లిస్తే విద్యుత్ సంస్థలు లాభాల్లో ఉంటాయి. కానీ ప్రజలకు ఉచితం ఇస్తున్నాం అంటూనే మరో వైపు ప్రజల నుండి ముక్కు పీల్చి విద్యుత్ ఛార్జీలు పెంచి వసూలు చేస్తుంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రో .డీజిల్ ధరలు పెరగలేదు. కానీ ఎన్నికలు అయిపోగానే… గ్యాస్..డీజిల్ ధరలు పెంచింది.

జీడీపీ పెంచుతాం అని మోడీ సర్కారు గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచింది. కేసీఆర్ విద్యుత్.. మోడీ గ్యాస్ ధరలు పోటా పోటీగా పెంచుతున్నారు. ఇద్దరు కలిసి దోపిడీ చేస్తూ… ఇద్దరూ ధర్నాలు చేస్తున్నారు. ప్రజలను దోచుకుంటుటున్న ఇద్దరూ… నాటకాలు ఆడుతున్నారు. బీజేపీ…టీఆర్ఎస్ సమన్వయంతో దోపిడీ జరుగుతోందన్నారు రేవంత్.

పెంచిన సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మార్చి 31 న సిలిండర్లకు దండలు వేసి .. డప్పు చాటింపు వేస్తాం అన్నారు. విద్యుత్ చార్జీల పెంపు నిరసిస్తూ మండల కేంద్రంలో ఏఈ, డీఈ కార్యాలయాల ముందు ఆందోళనలు నిర్వహిస్తాం అన్నారు. ఏప్రిల్ 4 న మండల కేంద్రాల్లో నిరసన ర్యాలీలు జరుపుతామన్నారు.

అంబేద్కర్ విగ్రహం ముందు కేసీఆర్..మోడీ దిష్టి బొమ్మ దగ్దం చేస్తామన్నారు రేవంత్ రెడ్డి. ఏప్రిల్ 5 న కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలుపతామన్నారు. ఏప్రిల్ 7న హైదరాబాద్ లో విద్యుత్ సౌద ముట్టడి వుంటుందన్నారు. వరి కొనక పోతే..ఇద్దరినీ ఉరి వేయాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇద్దరు కలిసి రాజకీయ ప్రయోజనం కోసం రైతులను చంపుతున్నారు. ఇద్దరూ వ్యూహాత్మకంగా రాజకీయ దురాశతో ఉన్నారని రేవంత్ మండిపడ్డారు.

https://ntvtelugu.com/sai-dharam-tej-thanks-note-video-and-new-movie-update/
Exit mobile version