NTV Telugu Site icon

Revanth Reddy: రూపాయి ముట్టుకున్నా సర్వనాశనమైపోతాం.. భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్న రేవంత్

Revanth Reddy

Revanth Reddy

Revanth Reddy: భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఈటల రాజేందర్‌ రాకపోవడంతో రేవంత్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. “నేను అమ్మవారిని నమ్ముతాను. మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో ఆందరికి తెలిసిందే. మునుగోడు ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీజేపీలు వందల కోట్లు ఖర్చుపెట్టాయి. ఆ ఎన్నికల సందర్భంగా రూ.3 వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి పాల్వాయి స్రవంతి ఒక్క రూపాయి పంచకుండా ప్రజాతీర్పు కోరింది. గతంలో పాల్వాయి స్రవంతి విసిరిన సవాల్ బీఆర్‌ఎస్, బీజేపీలు స్పందించలేదు. మునుగోడులో రూ.3వందల కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మునుగోడులో మద్యం పంపిణీ లేకుండా మేం ఓట్లు అడిగాం. ఒక్క రూపాయి పంచకున్నా పాల్వాయి స్రవంతికి పాతికవేల ఓట్లు వచ్చాయి. నిజాయితీగా 25వేల మంది కాంగ్రెస్‌ వెంట నిలిచారు.” అని రేవంత్ అన్నారు.

అమ్మవారి సాక్షిగా చెబుతున్నానంటూ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ప్రమాణం చేశార. “అమ్మవారి కండువా వేసుకుని ప్రమాణం చేస్తున్నా. ఆధారాలు చూపించాలని ఈటలకు సవాల్‌ విసురుతున్నా. కేసీఆర్‌ నుంచి సాయం పొంది ఉంటే మేమే సర్వనాశనమవుతాం. నేను చెప్పింది అబద్ధమైతే.. సర్వనాశనమైపోతాను. ఆధారాలు లేనప్పుడు దేవుడిపై ఆధారపడతాం. గర్భగుడిలో నిలబడి ఒట్టేసి చెప్పా కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ లేదు. ఆధారాలు లేకుండా ఈటల నాపై ఆరోపణలు చేశారు. చివరి బొట్టు వరకు కేసీఆర్‌తో పోరాడతా. ఈటల.. నీలాగా లొంగిపోయిన వ్యక్తిని కాదు. ఈటల రాజేందర్‌ ఆలోచించి మాట్లాడాలి” అంటూ రేవంత్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు.

Revanth: BJP vs Congress: నిప్పు రాజేసిన ఈటల కామెంట్స్.. భాగ్యలక్ష్మి గుడి వద్ద ప్రమాణానికి రేవంత్ రె’ఢీ’..

ఎవరి దగ్గర పారిపోలేదు లొంగిపోలేదు అన్న రేవంత్.. కేసీఆర్ వ్యతిరేక గొంతులకు ఇస్తున్న గౌరవం ఇదేనా అంటూ ఈటలను ప్రశ్నించారు. నీ వైఖరి తెలంగాణ సమాజానికి నష్టం అంటూ రేవంత్ మండిపడ్డారు. ఈ క్రమంలో రేవంత్ ఆవేదనకు గురై .. కంటతడి పెట్టుకున్నారు. కేసీఆర్‌తో కొట్లాడుతున్నప్పుడు నువ్వు కేసీఆర్ పక్కన నిలబడి ఉన్నావని.. కేసీఆర్ పక్కన సాక్షిగా నువ్వే కదా ఉన్నదని ఈటలను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ఈటల పట్ల తనకు తానుభూతి ఉండేదని.. కేసీఆర్‌ కక్ష కట్టినప్పుడు ఈటల తరపున సానుభూతిగా నిలబడ్డామని.. ఇది నా మనోవేదన అని.. ఈటల అర్థం చేసుకో అంటూ రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు.జైల్లో చిప్పకూడు తింటే.. తెలుస్తుందని అన్నారు. బీజేపీ పార్టీలో అనా పైసాకి పనికిరాని వాళ్ళు మాట్లాడితే తాను స్పందించే వాడిని కాదని రేవంత్ అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా కొట్లాడే వారి పట్ట మీ పద్ధతి ఇదా అంటూ ఈటలను రేవంత్ ప్రశ్నించారు. ఇంత పోరాటం చేస్తున్నా.. మమ్మల్ని అమ్ముడుపోయావా అంటావా అంటూ రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసీఆర్ సర్వం ధారపోసినా తనను కొనలేడని రేవంత్ అన్నారు. తనది చిల్లర రాజకీయం కాదని.. పోరాటం అంటూ తెలిపారు.