NTV Telugu Site icon

Revanth Reddy: మోడీని రక్షించడానికే.. కేసీఆర్ కాంగ్రెస్‌పై నిందలు

Revanth Reddy Fires

Revanth Reddy Fires

Revanth Reddy Fires On CM KCR After BRS Public Meeting: ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ప్రధాని మోడీకి వ్యతిరేకమైతే.. గుజరాత్‌లో బీఆర్ఎస్ ఎందుకు పోటీ చేయలేదు? పోటీ చేసిన అఖిలేశ్ భార్యకు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేయలేదు? ఢిల్లీలో ఆప్‌ను గెలిపించమని కేజ్రీవాల్‌కి మద్దతుగా ఎందుకు చెప్పలేదు? అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్, కేజ్రీవాల్ భాగస్వాములేనని ఆరోపించిన ఆయన.. కనీస వ్యాపార భాగస్వామ్యకి కూడా ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. బీజేపీపై కొట్లాడుతామంటున్న కేసీఆర్.. మరి కాంగ్రెస్‌పై ఎందుకు ఎందుకు దాడి చేస్తున్నారని అడిగారు.

CM KCR: బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. దేశమంతా రైతు బంధు, ఉచిత కరెంటు

భాక్రానంగల్ మొదలుకుని నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాకా.. అన్నీ కట్టించింది కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విశాఖ ఉక్కు, ఎల్‌ఐసీలను తెచ్చిందీ కాంగ్రెసేనని.. కానీ వాటిని ఇప్పుడు మోడీ అమ్ముకుంటున్నారని ఆరోపించారు. మోడీ అమ్మకానికి పెట్టిన సంస్థలు, దేశానికి అంకితం చేసిందెవరో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ ఆస్తులు అమ్ముకుంటుంటే.. మద్దతు ఇచ్చింది నువ్వు కాదా? అని కేసీఆర్‌ని నిలదీశారు. ఇప్పుడు మోడీ మీద వ్యతిరేకత రాగానే, కేసీఆర్ రంగు మార్చే పనిలో పడ్డారని విమర్శించారు. కమ్యూనిజం, లెనినిజం ఎలాగో, దేశానికి నెహ్రూఇజం కూడా అలాంటిదేనన్నారు. మోడీని రక్షించడానికే కేసీఆర్ కాంగ్రెస్‌పై నిందలు వేస్తున్నారని ఆరోపణలు చేశారు. 65 ఏళ్లలో కాంగ్రెస్ రూ.56 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కేవలం 8 ఏళ్లలోనే మోడీ వంద లక్షల కోట్లు అప్పు చేశారని.. మోడీకి, కాంగ్రెస్‌కి పోలిక ఏందని రేవంత్ మండిపడ్డారు. తాము చైనా మెడలు వంచితే.. మోడీ వారికి భారత భూభాగాన్ని సరెండర్ చేశారన్నారు. పైగా చైనా అక్రమించుకోలేదని మోడీ క్లీన్ చిట్ ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Fact Check: ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని ప్రచారం.. ఖండించిన ఏపీ పౌరసరఫరాల శాఖ

100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తానని కేసీఆర్ చెప్పారని.. ఇంకా ఎందుకు తెరవలేదని రేవంత్ ప్రశ్నించారు. ఖాగజ్ నగర్ పేపర్ మిల్లు మూసింది కూడా కేసీఆరేనన్నారు. కెనడా నుండి కందిపప్పు దిగుమతి చేస్తున్నామని కేసీఆర్ అన్నారని.. అసలు కెనెడాలో పప్పు దినుసులే ఉండవని పేర్కొన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని చైనా నుంచి తీసుకురావట్లేదా? అని అడిగారు. ఈ సభకు మాజీ సీఎం కుమార స్వామి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలన్నారు. సునీల్ కనుగోలు ఆఫీస్‌పై దాడి చేసిన తర్వాత.. కర్ణాటకలో స్మాల్ మార్జిన్‌తో కాంగ్రెస్ గెలిచే సీట్లపై కేసీఆర్ కన్నేశారన్నారు. కాంగ్రెస్ నాయకుడిని ఫార్మ్ హౌస్‌కి పిలిచి రూ. 500 కోట్లు ఆఫర్ ఇచ్చింది నిజం కాదా..? అని చెప్పారు. 20 సీట్లకు తగ్గిపోయేలా కుట్ర కూడా పన్నారని.. అయితే పార్టీ అధిష్టానం గమనించి అలెర్ట్ అయ్యిందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే కేసీఆర్‌ని నొప్పి ఏంటని.. కాంగ్రెస్‌ని ఓడించడానికి సుపారీ తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీకి లాభం చేయడానికే కేసీఆర్ ఈ పని చేస్తున్నారని.. కాలం నీక్కూడా సమాధానం చెప్తుందని హెచ్చరించారు.

Pakistan: పాకిస్తాన్‌కు షాక్ ఇవ్వనున్న అమెరికా.. నాటోయేతర మిత్రదేశ హోదా రద్దు.!

బెంగుళూరు సిటీలో కూడా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కేసీఆర్ ఎంకరేజ్ చేస్తున్నారని.. కాంగ్రెస్‌లో అంతర్గత పంచాయతీ తెచ్చి, ఓడగొట్టాలని చూస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. డిసెంబర్‌లో ఎప్పుడూ శీతాకాల సమావేశాలు అయ్యేవని, కానీ కేసీఆర్ పెట్టలేదని అన్నారు. బడ్జెట్ సమావేశాలు పెట్టకపోతే, కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉందన్నారు. ఫిబ్రవరిలో సభ రద్దు చేస్తే.. ఏప్రిల్‌లో ఎన్నికలొస్తాయనేది కేసీఆర్ ఎత్తుగడ అని పేర్కొన్నారు. ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమని.. నియోజకవర్గ నాయకులను ఇప్పటికే అలెర్ట్ చేశామన్నారు. ప్రజా ప్రతినిధుల పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లలు అధికారం ఉంది కదా అని విచ్చలవిడిగా ప్రవర్తించవద్దని చెప్పారు.

Show comments