Site icon NTV Telugu

Revanth Reddy : జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి

Revanth Reddy S

Revanth Reddy S

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. తెలంగాణలోనూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోనూ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీ కుటుంబంకి నోటీసులు ఇవ్వడం అంటే.. దేశం నీ అవమానించడమేనని, గాంధీ కుటుంబంకి జరిగిన అవమానం కాదు.. దేశ ప్రజలకు జరిగిన అవమానంగా రేవంత్‌ రెడ్డి అభివర్ణించారు. ఇందిరాగాంధీపై సీబీఐ కేసు పెట్టీ అవమానిస్తే… దేశం ఏకం అయ్యిందని, తిరిగి దేశానికి ఇందిరా గాంధీ ప్రధాని అయ్యిందని ఆయన గుర్తు చేశారు. జూన్ 23 బీజేపీ పతనానికి పునాది రాయి అని ఆయన మండిపడ్డారు. సోనియా గాంధీ ఈడీ ఆఫీస్ లో అడుగు పెట్టిన క్షణం నుండే మోడీ..అమిత్ షా పతనం మొదలైందన్నారు.

బీజేపీకి రోజులు దగ్గర పడ్డాయని, గాంధీ కుటుంబం మీద ఏం జరిగినా.. జనం చూస్తూ ఉండరన్నారు. సోనియా గాంధీ తెలంగాణకు తల్లి లాంటిదని, అలాంటి తల్లిని అవమనిస్తుంటే చూస్తూ ఊరుకుంటామా..? అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ వారసులం కాబట్టి శాంతియుత నిరసన చేశాం.. సోనియా గాంధీని అవమానించాలని చూస్తే ఊరుకోమని ఆయన ధ్వజమెత్తారు. ఈ నెల 23న మళ్లీ ఈడీ ఆఫీస్ కి వస్తమని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా… రాష్ట్రంకి ముందు ఈడీ, సీబీఐ వస్తుంని, తర్వాత మోడీ..అమిత్ షా వస్తారన్నారు. గాంధీ కుటుంబం మీద కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తుందని, గాంధీ కుటుంబం ఈక కూడా పీకలేరని ఆయన మండిపడ్డారు.

Exit mobile version