Site icon NTV Telugu

Revanth Reddy: రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోంది

Revanthreddy

Revanthreddy

Revanth Reddy: రోజురోజుకు రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ ప్రశ్నించారు. లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ కరెన్సీ రోజురోజుకు బలహీనపడటంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. డాలర్ తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలన్నారు రేవంత్. గతంలో రూపాయి 69కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్న మోడీ రూపాయి ఐసీయూలో పడిపోయిందని రేవంత్‌ ఎద్దేవ చేశారు.

Read also: Varla Ramaiah: వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం.. సీఈసీకి టీడీపీ కంప్లైంట్

కానీ ఇప్పుడు రూపాయి విలువ 82ను దాటిపోయిందని తెలిపారు. రూపాయి పతనంతో సామాన్యులపై ఆ ప్రభావం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రోజురోజుకు రూపాయి విలువ పడిపోతున్నా మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. స్వాతంత్య్రం తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.55,87,149 కోట్లు అని తెలిపారు. 2014 నుంచి 2022 వరకు మోదీ ప్రభుత్వం రూ.80,00,744 కోట్లు అంటూ లోక్‌ సభ సాక్షిగా తెలిపారు రేవంత్‌. 67 ఏళ్లలో పాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులకంటే.. మోడీ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువ అని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Butterfly: బ్యాక్ టూ బ్యాక్ అనుపమ చిత్రాలు!

Exit mobile version