Revanth Reddy: కస్టడీ లోకి తీసుకోక ముందు , విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి పేపర్ల లీకులపై ధ్వజమెత్తారు. సర్వీస్ కమిషన్ పేపర్లు అన్ని ముందే వాళ్లకు చేరాయని తెలిపారు. 2015 నుండి ప్రశ్న పత్రాల లీక్ కొనసాగుతుందని అన్నారు. కేటీఆర్ ఇద్దరు వ్యక్తులను మాత్రమే సంబంధం అంటున్నారని, ఇది వ్యవస్థకు సంబంధం లేదు అంటున్నారు, కేటీఆర్ అరెస్ట్ చేయడమే కాదు జైలులో పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్ చేసిన వాళ్ళను ఎక్కడెక్కడ పెట్టారో చెప్పాలన్నారు. కస్టడీ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. నిందితుల దగ్గరికి ప్రభుత్వం తరుపున వెళ్లిన మధ్య వర్తులు ఎవరు? ఇది బయట పెట్టాలని డిమాండ్ చేశారు. జైలును సందర్శించిన విజిటర్ వివరాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. సిసి ఫుటేజీ స్పష్టంగా కావాలని తెలిపారు.
Read also: Vemula Prashanth Reddy: రేవంత్ రెడ్డివి దొంగ మాటలు.. తనతో ఉన్నవాళ్లు కూడా దొంగలు
కస్టడీ లోకి తీసుకోక ముందు, విచారణ చేయక ముందే ఇద్దరు మాత్రమే బాద్యులు అని కేటీఆర్ ఎలా చెపుతారు? అంటూ మండిపడ్డారు. సంస్ధలో పనిచేసే వాళ్లు ఎగ్జామ్ రాయడానికి వీలు లేదని, కానీ ప్రవీణ్ తో పాటు 20 మంది కి ఎలా ఎన్ ఓసి ఇస్తారు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర శాఖలకు వెళ్లాలి అక్కడే ఉద్యోగం చేయరాదన్నారు. మాధురి స్టేట్ ఫస్ట్, రజిని కాంత్ 4 ర్యాంక్, TSPSC లో పని చేస్తున్నారు. ఒకే సెంటర్ లో 25 మందికి టాప్ ర్యాంక్స్ వచ్చాయన్నారు. కేటీఆర్ పీఏ తిరుపతి.. కేటీఆర్ షాడో మంత్రి అన్నారు. వీళ్లిద్దరి ఓకే మండలమని, రాజశేఖర్ రెడ్డి కి తిరుపతి ఉద్యోగం ఇప్పించారని ఆరోపించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించి TSPSC కి పంపారని అన్నారు. ఈ కథ నడిపించింది తిరుపతి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్యాల మండలంలో 100 మందికి క్వాలిఫై అయ్యారని రేవంత్ తెలిపారు.
Naveen father: పేపర్ లీకేజ్ తో నవీన్ కి సంబంధం లేదు.. దయచేసి శవరాజకీయాలు చేయకండి