NTV Telugu Site icon

Revanth Reddy: నా ఇంటికి రా భయ్యా అంటూ రేవంత్‌ ఎమోషనల్‌ ట్విట్‌.. ఎరికోసమో తెలుసా..

Rahul Gandhi Revanth Reddy

Rahul Gandhi Revanth Reddy

Revanth Reddy: రాహుల్‌ గాంధీపై వేటు మొదలు కొని ఢిల్లీలోని అధికారిక నివాసం ఖాళీ చేయించే వరకు జరుగుతున్న పరిణామాలపై ఆపార్టీ జీర్ణించుకోలే పోతుంది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలు తీవ్రంగా బీజేపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతున్నారు. తమదైన శైలిలో కేంద్రంలోని బీజేపీపై మండిపడుతున్నారు. అయితే రాహుల్‌ గాంధీని పార్లమెంట్ సభ్యులకు కేటాయించే అధికారిక బంగళాను ఖాళీ చేయాలంటూ కేంద్రం జారీ చేసిన నోటీసులపై రాహుల్ గాంధీ స్పందించారు. ఎంపీ బంగ్లాను ఖాళీ చేస్తా అంటూ హ్యాపీ మెమోరీస్ అంటూ రాహుల్ లేఖ రాశారు. దీనిపై టీపీసీసీ రేవంత్‌ రెడ్డి స్పందించారు. రాహుల్‌ భయ్యా నా ఇంటి రా.. నాఇల్లు నీ ఇల్లే అంటూ లేఖ రాశారు. ఇది నా అత్మీయ ఆహ్వానం అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన ట్విట్‌ ఇప్పుడు వైరల్‌ గా మారింది.

Read also: Bellamkonda Srinivas: చరిత్ర సృష్టించిన బెల్లంకొండ.. వరల్డ్ రికార్డ్ సొంతం

కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మీయ ఆహ్వానం ప్రస్తుతం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘నా ఇంటికి రా.. ఇది నీ ఇల్లు భయ్యా’ అంటూ రాహుల్ గాంధీని ఢిల్లీలోని తన ఇంటికి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. ‘నా ఇల్లు మీ ఇల్లు… మిమ్మల్ని నా ఇంటికి ఆహ్వానిస్తున్నాను.. మనది ఒకే కుటుంబం.. ఇది మీ ఇల్లు’ అంటూ సోషల్ మీడియా వేదికగా రాహుల్ గాంధీకి రేవంత్‌ రెడ్డి సందేశం పంపారు.

Read also: Playgrounds under flyovers: హైదరాబాద్‌లో త్వరలో ఫ్లైఓవర్ల కింద క్రీడా మైదానాలు!

రాహుల్ గాంధీపై మోడీ ప్రభుత్వం లోక్ సభ సభ్యునిగా అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని కేంద్రం కోరింది. ఏప్రిల్ 23లోగా తన 12 తుగ్లక్ లేన్ బంగ్లాను ఖాళీ చేయాలని కాంగ్రెస్ నేతకు నిన్న నోటీసులు అందాయి. ఈ నేపత్యంలో స్పందించిన రాహుల్ గాంధీ, నోటీసుకు కట్టుబడి ఉంటానని లేఖలో స్పష్టం చేశారు. గత నాలుగు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైన సభ్యునిగా, నేను ఇక్కడ గడిపాను. ఈ భవనంతో ఎన్నో ఆనందకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. ఇందుకు కారణం ప్రజలే అని, వారికి రుణపడి ఉన్నానని లోక్‌సభ సెక్రటేరియట్‌కు లేఖ రాశారు. తన హక్కులకు భంగం కలగకుండా, మీ లేఖలో ఉన్న వివరాలకు కట్టుబడి ఉంటాను అని తెలిపారు. 2004లో ఎంపీగా అరంగేట్రం చేసిన రాహుల్ గాంధీ 2005 నుంచి ఢిల్లీలోని తుగ్లక్ లేన్‌లోని బంగ్లాలో ఉంటున్నారు. ఇప్పటి వరకు ఇదే రాహుల్ అధికారిక నివాసంగా ఉంది. రాహుల్ గాంధీ తొలిసారిగా 2004లో ఎంపీగా పార్లమెంటులో కాలుపెట్టారు. ఇప్పటివరకూ నాలుగు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు.


Wayanad By-Election: వయనాడ్‌ ఉపఎన్నికపై ఉత్కంఠ.. కర్ణాటకతో పాటు ఈసీ షెడ్యూల్‌ ప్రకటిస్తుందా?

Show comments