Revanth Reddy : కోట్లాడిన వాళ్లకే బీ ఫామ్‌.. కోటా లేదు.. వాటా లేదు..

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయాలంటూ.. టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి గాంధీ భవన్‌లో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఆయన మాట్లాడుతూ.. 42 మంది ఎమ్మెల్యే లతో తెలంగాణ కోసం లేఖ రాసింది తెలంగాణ కాంగ్రెస్ నేతలేనని ఆయన అన్నారు. కోట్లాడిన వాళ్ళకే బీ ఫామ్ అని, కోటా లేదు..వాటా లేదు అంటూ ఆయన స్పష్టం చేశారు. కొట్లాటలో ఉన్నోళ్లకే టికెట్లు.. ఇంటికి తెచ్చి ఇస్తానని ఆయన అన్నారు. కొత్తగా వచ్చిన రాష్ట్రం కోతుల గుంపుకి అప్పగించినట్లు అయ్యిందని ఆయన విమర్శించారు.

కేసీఆర్‌కి ప్రభుత్వం కట్టపెడితే అలాగే తెలంగాణ అయ్యిందని ఆయన అన్నారు. పార్టీ అధ్యక్ష పదవి కంటే… యువజన కాంగ్రెస్ అధ్యక్ష పదవి నాకు ఇష్టమని, కాంగ్రెస్ పెద్ద అయితే.. పెద్దోళ్ళు చెప్పినట్టు వినాలి.. దూకుడు వద్దు అని సంయమనం అని చెప్తున్నారన్నారు. నేనే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నీ అయితే… కేసీఆర్‌ కి పక్క లో బల్లెం అయ్యే వాణ్ణి అని, గుండెళ్ళో గునపం అయ్యే వాణ్ణి అని ఆయన ఉద్ఘాటించారు.

https://ntvtelugu.com/cs-somesh-kumar-said-ts-bpass-is-running-successfully/