NTV Telugu Site icon

Revanth Letter to Kcr: కట్టుబానిసల్లా వీఆర్వోలు

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌ తరహాలో మాటల తూటాలు పేలుతుంటాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనపై మండిపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. మీ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందన్నారు రేవంత్. గొడ్డు చాకిరీ చేయించుకుని… వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. చాలీ చాలని జీతాలు … ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల పరిస్థితి దుర్భరంగా ఉందన్నారు. వీఆర్ఒలకు పే స్కేల్ అమలు చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలు చేయడంలేదని మండిపడ్డారు. హామీలు ఇవ్వడం తప్ప అమలు చేయాలన్న సోయి మీకు లేదన్నారు రేవంత్.

శేషాద్రి కమిటీ ఓ కంటి తుడుపు చర్య అన్నారు. వీఆర్ఒలకు తక్షణం పే స్కేల్ అమలు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. అర్హులైన వీఆర్ఒలకు పదోన్నతులు కల్పించాలని, వాళ్లకు సొంత గ్రామాలలో డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఒల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రేవంత్ రెడ్డి.తెలంగాణ ప్రభుత్వం వీఆర్వోల వ్యవస్థను రద్దు చేసి 16 నెలలు గడుస్తోంది. రాష్ట్రంలో విధులు లేకుండా ఐదు వేల 756 మంది వీఆర్వో లు ఖాళీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన తమకు అన్యా యం జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వీఆర్వోలు.