NTV Telugu Site icon

Tamilisai Soundararajan: కొత్త భవనాలు నిర్మించినంత మాత్రాన అభివృద్ధి కాదు..

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan

Tamilisai Soundararajan: తెలంగాణ రాజ్‌భవన్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. రాజ్‌భవరన్‌ లో జాతీయ పతాకావిష్కరణ చేశారు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనది అన్నారు. మేధావులు, మహాన్నత వ్యక్తులు మన రాజ్యాంగం రూపొందించారన్నారు. రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. శాతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ ఎన్నో రంగాల్లో దూసుకుపోతోందని తెలిపారు. తెలంగాణ ఘనమైన, విశిష్టమైన చరిత్ర ఉందన్నారు గవర్నర్‌. రాజ్యాంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందని తెలిపారు. రాజ్యాంగ్య రచనలో అంబేడ్కర్‌ ఎంతో అంకితభావం కనబరిచారని, మేధావులు, మహోన్నత వ్యక్తులు మన రాజ్యంగం రూపొందించారని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశం మనదని తెలిపారు.

Read also: Republic Day: రిపబ్లిక్ వేడుకలకు అంతా సిద్ధం.. ముఖ్య అతిథిగా ఈజిప్ట్ అధ్యక్షుడు

తెలంగాణలో ఆందోళన కర పరిస్థితులు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు గవర్నర్‌ తమిళిసై. రాష్ట్రం లో రోజుకు 22 మంది ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిపారు. కొందరికి ఫార్మ్ హౌస్ లు కాదు.. అందరికీ ఫార్మ్ లు కావాలని గవర్నర్‌ తమిళిసై అన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కును కాపాడుకుందామని తెలిపారు. కొంత మందికి నేను నచ్చక పోవచ్చు..కానీ.. నాకు తెలంగాణ వాళ్ళు అంటే ఇష్టమన్నారు. ఎంత కష్టం అయిన పని చేస్తానని సంచలన వ్యాక్యలు తెలిపారు. పవిత్ర తెలంగాణ నేలపై జాతీయ జెండా ఎగురవేయడం గర్వంగా ఉందన్నారు. దేశభక్తితో కూడిన ఆరు దశాబ్దాల ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం అని తెలిపారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్న శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతరులకు అభినందనలని, సవాళ్లకు అనుగుణంగా కొత్త విధానాలు అనుసరిస్తున్న రైతుల స్ఫూర్తికి సెల్యూట్ అన్నారు గవర్నర్‌.

Read also: Facebook Down: అమెరికాలో ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ డౌన్..

రాష్ట్రంలో జాతీయ రహదార్ల విస్తరణ కు భారీగా నిధులు ఇస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో అందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపు నిచ్చారు. ఆదిమ గిరిజన జాతుల వారి కోసం రాజ్ భవన్ కార్యక్రమాలు చేపట్టిందని, ఛాన్స్ లర్ కనెక్ట్ అల్యూమినీ ద్వారా ఉన్నత విద్యపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తామని తెలిపారు. రైతులు, పేదలు అందరికీ భూములు, ఇండ్లు కావాలన్నారు. ధైర్యంగా ఉండాలని యువతకు విజ్ఞప్తి చేశారు గవర్నర్‌. తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టుకుందాం.. తెలంగాణ అభ్యుదయంలో నా పాత్ర ఉంటుందని తెలిపారు. దేశంలోని అన్ని నగరాలకు హైదరాబాద్‌ తో కనెక్టవిటీ ఉందని అన్నారు గవర్నర్‌ తమిళిసై. ఇటీవలే సికింద్రాబాద్‌ కు ప్రధాని వందేభారత్‌ రైలు కేటాయించారన్నారు. రాష్ట్రాభివృద్ధికి అవసరమైన సహకారాన్ని రాజ్‌భవన్‌ అందిస్తోందన్నారు. తెలంగాణ గౌరవాన్ని నిలబెడదా, ప్రజాస్వామ్యాన్ని కాపాడదామన్నారు. ఎం.ఎం. కీరవాణి, చంద్రబోస్‌ను గవర్నర్ సన్మానించారు. బాలలత, ఆకుల శ్రీజను సన్మానించారు గవర్నర్. పద్మశ్రీ అవార్డు దక్కడం చాలా ఆనందంగా ఉందన్నారు కీరవాణి. భగవంతుని ఆశీర్వాదం, ప్రజల అభిమానంతోనే పద్మశ్రీ వచ్చిందని తెలిపారు కీరవాణి.
Republic Day 2023: దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు