Site icon NTV Telugu

Congress Manifesto: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..

Telangana Manicesto

Telangana Manicesto

Congress Manifesto: ఇందిరమ్మ రాజ్యం..ఇంటింటా సౌభాగ్యం అనే పేరుతో తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ ఉదయం గాంధీభవన్ లో మేనిఫెస్టోను ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి అందరూ కాలిసి విడుదల చేశారు. అనంతరం మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ గొంతుకల ఆలోచన మేరకు మేనిఫెస్టో అన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే 23 అంశాలపై దృష్టి సారిస్తోందన్నారు. వాటినే మేనిఫెస్టో లో చేర్చామన్నారు.

Read also: Ram Charan-Sukumar:సుక్కు ఏం ప్లాన్ చేస్తున్నావయ్యా?

విభజన చట్టం లో హామీలు ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉందన్నారు. బయ్యారం లో ఉక్కు ఫ్యాక్టరీ.. మైనింగ్ విశ్వవిద్యాలయం .. లాంటి అంశాలు పూర్తి చేస్తామన్నారు. నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ లో అని తెలిపారు. నూతన ఎయిర్పోర్ట్, కొత్త రైల్వే లైన్ మణుగూరు కి.. వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు, ఆంధ్రలో విలీనం అయినా ఐదు గ్రామాలు వెనక్కి తెలంగాణలో కలుపుతామన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసింది బీఆర్ఎస్ అన్నారు. దాన్ని అధిగమించి నాలుగు హామీలు అమలు చేశామన్నారు. ఇక ఇంచార్జి దీపా దాస్ మున్షీ మాట్లాడుతూ.. బీజేపీ ఎన్నో అబద్ధపు హామీలు ఇచ్చిందన్నారు. మోడీ..అమిత్ షా లు 400 సీట్లు అంటున్నారని తెలిపారు. రాహుల్ గాంధీ జోడో యాత్రతో దేశం మొత్తం తిరిగారన్నారు. మోడీకి భయం పట్టుకుందన్నారు.

Read also: Mudragada vs Daughter: తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ.. షాకింగ్‌ కామెంట్స్..!

తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హామీలు ఇవే..

1. హైదరాబాద్ మహా నగరానికి బిజెపి ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్ పునఃప్రారంభం

2 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 ప్రకారం

a) కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ,

b) బయ్యారంలో ఉక్కు కర్మాగారం,

c) హైదరాబాదులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM)

d) హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారి పక్కనుండి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ.

e) మైనింగ్ విశ్వవిద్యాలయం

3. భద్రాచల దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలు అయినా ఏటపాక, గుండాల, పురుషోత్తం పట్నం, కన్నెగూడెం మరియు పిచుకలపాడులు తిరిగి తెలంగాణాలో విలీనం.

4. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా.

5. నీతి అయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు.

6. నూతన ఎయిర్పోర్ట్ల ఏర్పాటు,

7. రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు.రం రం

8 నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు.. (మంచిర్యాలు

9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు. 10. నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు

11, జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు.

12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ఏర్పాటు

13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (IIFT) ఏర్పాటు.

14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ (IARI) క్యాంపస్ ఏర్పాటు. ఇద్

15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు.

16. అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు.

17. 73 & 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ.

18. ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు.

19. దిగువ తెలిపిన ఇండస్ట్రియల్ కారిడార్ల ఏర్పాటు.

a) హైదరాబాద్- బెంగళూరు IT మరియు ఇండస్ట్రియల్ కారిడార్ b) హైదరాబాద్ – నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్

C) హైదరాబాద్ వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్

d) హైదరాబాద్ నుండి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్

e) సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు,

20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రం (International Cultural and Entertainment Hub)

21. మేడారం సమ్మక్క సారలమ్మ దాతరకు జాతీయ హోదా.

22. డ్రై పోర్టు ఏర్పాటు.

23. హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు

Read also: Mudragada vs Daughter: తన కూతురి వ్యాఖ్యలపై స్పందించిన ముద్రగడ.. షాకింగ్‌ కామెంట్స్..!

మరోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని కేంద్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 హామీల మంత్రం ఫలించడంతో ఈసారి లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రకటించిన హామీలపై రాజకీయ వర్గాలు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జాతీయ స్థాయిలో ‘న్యాయ్ పాత్ర’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో నేడు విడుదల చేయనున్న ప్రత్యేక మేనిఫెస్టోతో 23 హామీలను కాంగ్రెస్ విడుదల చేసింది.
Maharashtra: మహారాష్ట్రలో కూలిన హెలికాప్టర్.. క్షేమంగా బయటపడ్డ పైలెట్

Exit mobile version