Site icon NTV Telugu

తెలంగాణ ప్రజలకు షాక్.. మళ్లీ పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

తెలంగాణలో మరోసారి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. అదనంగా రూ.4,500 కోట్ల రాబడికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఆస్తులు, భూముల విలువపై సహేతుక ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువలను 50 శాతం పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.

Read Also: శరవేగంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలు.. 4 రోజుల్లో 45

అటు స్థలాల విలువను 35 శాతం, అపార్టుమెంట్ల విలువను 25 శాతం పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ మూలన చూసినా ఎకరం రూ.30 లక్షలకు పైగా పలుకుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలను 60 నుంచి 150 శాతం పెంచే ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు సమాచారం. కాగా గత ఏడాది వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల విలువతో పాటు 20 శాతం రిజిస్ట్రేషన్ ఛార్జీలను ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే.

Exit mobile version