NTV Telugu Site icon

Red alert: తెలంగాణలో 10 జిల్లాలకు రెడ్ అలర్ట్.. వ‌ర‌ద ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు..

Read Alert

Read Alert

Red alert: తెలంగాణలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పలు చోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. వర్షాలకు విద్యుత్ స్తంభాలు, చెట్లు కూలిపోతున్నాయి. అయితే రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ మేరకు గురువారం రాత్రి వాతావరణ బులెటిన్‌ విడుదల చేసి హెచ్చరికలు జారీ చేసింది.

Read also: Shriya Saran : టెంప్టింగ్ పోజులతో మతిపోగొడుతున్న శ్రీయ

నేడు కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ ప్రకటించారు. అలాగే వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రేపటి నుంచి 25వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కొమరం భీం జిల్లా బిజ్జూరులో 257.4, జంగం జిల్లా జఫర్‌గఢ్‌లో 174.2, సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో 133, మెదక్‌లో 131.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే జనగాం జిల్లాలో 88.4, మెదక్ జిల్లాలో 131.2, కొమరం భీం జిల్లాలో 69.1, మహబూబాబాద్ జిల్లాలో 66.6, సిద్దిపేట జిల్లాలో 66.1, మహబూబ్ నగర్ జిల్లాలో 1.7, నల్గొండలో 6.2 మి.మీ. మి.మీ, నిజామాబాద్ జిల్లాలో 21.5 మి.మీ, రామగుండం జిల్లాలో 63.5 మి.మీ. హైదరాబాద్‌లో 43.3, ఖమ్మంలో 11.2, హనుమకొండలో 43.0, దుండిగల్‌లో 68.7, హకీంపేటలో 47.8, భద్రాచలంలో 92.4, ఆదిలాబాద్‌లో 14.0 మి.మీ.
Muslim Population: దేశంలో పెరిగిన ముస్లింల జనాభా.. లోక్ సభలో గణాంకాల వెల్లడి