హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధి కర్ణంగూడ దగ్గర కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి… ఈ ఘటనలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో రియల్టర్ పరిస్థితి విషమంగా ఉంది… ఈ ఘటనకు భూ వివాదమే కారణంగా చెబుతున్నారు.. ఇటీవలే 10 ఎకరాల భూమిని ఇంద్రారెడ్డి అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేశారు శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి అనే ఇద్దరు రియల్టర్లు.. అయితే, అప్పటికే ఆ భూమిపై కబ్జాలో ఉన్నాడు మట్టారెడ్డి అనే వ్యక్తి.. కాగా, ఇవాళ సెటిల్‌మెంట్ కోసమని అంతా కలుసుకున్నట్టుగా తెలుస్తుండగా… మట్టారెడ్డితో వాగ్వాదం జరిగింది.. ఆ తర్వాత కాసేపటికే కాల్పులు జరిపారని చెబుతున్నారు..
Read Also: Fuel Price: గ్యాస్ బాదేశారు.. ఇక పెట్రోల్, డీజిల్ వంతు..!
ఈ ఘటనలో స్పాట్‌లో శ్రీనివాస్ రెడ్డి మృతిచెందగా.. రాఘవేందర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి.. ఉదయం 8 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగినట్టుగా తెలుస్తోంది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మట్టారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.. ఉదయం శ్రీనివాస్‌రెడ్డి కారులో ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేసినట్టుగా తెలుస్తోంది.. శ్రీనివాస్‌రెడ్డి, రాఘవేంద్‌రెడ్డితో పాటు ఉన్న ఓ మూడో వ్యక్తి ఎవరు అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. ఇక, మృతుడు శ్రీనివాసరెడ్డి.. మీర్‌పేట పరిధిలోని వినాయక హిల్స్‌లో నివాసం ఉంటారని తెలుస్తోంది.. వివాదాల్లో వున్న భూముల సెటిల్‌మెంట్లలో ఆయన ఎక్కువగా తలదూర్చిన సందర్భాలు ఉన్నాయంటున్నారు.. ఎప్పుడు స్కార్పియో కారులో తిరిగే ఆయన వెంట మరో రెండు స్కార్పియోలో ఉంటాయని.. తరచూ కార్లను మారుస్తారని చెబుతున్నారు. ఇంటి దగ్గర కూడా ఎప్పుడూ అనుచరులు కాపలాగా ఉంటారని సమాచారం..