NTV Telugu Site icon

MLA Krishna Rao: రాజీనామాకు నేను సిద్దం.. లేదంటే బండి సంజయ్‌ రాజీనామా చేస్తారా?

Mla Krishna Rao

Mla Krishna Rao

బండి సంజయ్ కు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సవాల్ విసిరారు. మూసపేటలో చెరువుల కబ్జా చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన బండి సంజయ్ ఆరోపణల పై ఎమ్మెల్యే స్పందించారు. నేను చెరువుల కబ్జాకు పాల్పడినట్లు నిరూపణ అయితే రాజీనామాకు సిద్దమన్నారు. కబ్జాలలో బీజేపీ నాయకుల హస్తం ఉంటే బండి సంజయ్ రాజీనామాకు సిద్దమా? అని సవాల్‌ విసిరారు. చెరువు కబ్జా ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని, నిజమని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు.

Read also: Nora Fatehi: 200 కోట్ల మనీలాండరింగ్ కేసు.. నోరా ఫతేహిని విచారిస్తున్న ఢిల్లీ పోలీసులు

కాగా.. బీజేపీ వాళ్లే కబ్జా చేశారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. నగరంలోని కేపీహెచ్‌బీలో ఆసరా లబ్ధిదారులకు పింఛన్లను ఎమ్మెల్యే కృష్ణారావు పంపిణీ చేశారు. ఈనేపథ్యంలో.. ఆయన మాట్లాడుతూ, భూ ఆక్రమణలపై బీజేపీ నేతలతో కమిటీ ఏర్పాటు చేస్తే విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. తాను చెరువులు కబ్జా చేసినట్లు నిరూపిస్తే.. తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. మరి బీజేపీ నేతలు ఆక్రమించారని తేలితే బండి సంజయ్‌ రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు.
Why People Lose Money in Stock Markets?: జనం స్టాక్‌ మార్కెట్లలో డబ్బులను ఎందుకు పోగొట్టుకుంటున్నారంటే..