Site icon NTV Telugu

Masala Fraud : మసాలాల్లో ఎలుకల మలం.. తనిఖీల్లో షాకింగ్ నిజాలు..!

Masala Fraud

Masala Fraud

Masala Fraud : రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు మసాలా తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. 30కి పైగా మసాలా మాన్యుఫాక్చరింగ్, ప్యాకింగ్ సెంటర్స్‌పై ఈ దాడులు నిర్వహించగా, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను పాటించకుండా స్పైసెస్ తయారు చేస్తున్న సెంటర్లను గుర్తించారు. రంగారెడ్డి జిల్లా జల్ పల్లి లోని శ్రీవారి స్పైసెస్, బండ్లగూడ జాగీరు లోని డివైన్ స్పైసెస్ లాంటి కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో మసాలాలు తయారు అవుతున్నట్టు అధికారులు గుర్తించారు.

Operation Sindoor: మరో ఆపరేషన్ సిందూర్‌ను తట్టుకోలేరు .. పాక్‌కు భారత సైన్యం వార్నింగ్..

విచారణలో.. చిల్లి పౌడర్, పసుపు, మిరియాలు, కరివేపాకు పొడి, ధనియాలు సేకరించి ల్యాబ్‌లో పరీక్షకు పంపారు. రిపోర్ట్ లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మిరియాలు, ఇతర మసాలాల్లో ఎలుక మలం, దుమ్ము, మిశ్రమాలు ఉండటం కనిపించింది. ఈ మసాలాలను ప్యాకింగ్ చేసి షాప్స్‌కు పంపుతున్న నిర్వాహకులు వినియోగదారుల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసినట్లు తేలింది. అదనంగా, గడువు ముగిసిన, లేబుల్ లేని ప్రొడక్ట్స్ కూడా స్టోర్ చేయబడ్డాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ కేసులో నిబంధనలు పాటించని మసాలా తయారీ కేంద్రాలకు నోటీసులు జారీ చేస్తూ, ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని అధికారులు హెచ్చరించారు.

Silver: ధర పెరుగుతుందని వెండిపై ఇన్వెస్ట్ చేస్తున్నారా?.. మీ డబ్బు పోవచ్చు!

Exit mobile version