Bandi Sanajay: డీలర్ల సమ్మెతో ఇబ్బంది.. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు నిలిచిన రేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanajay: రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారని, పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడిందని, రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రేషన్ డీలర్ల న్యాయబద్దమైన డిమాండ్లను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి వాళ్ల సమస్యలను పరిష్కరించకపోవడం సిగ్గు చేటు. రేషన్ డీలర్లను పిలిచి మాట్లాడే తీరిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు. మే 22న సమ్మె నోటీస్ ఇచ్చిన తరువాత వాళ్ల సమస్యలన్నీ పరిష్కారిస్తామని, ఈ మేరకు జూన్ ఫస్ట్ న జీవోలను విడుదల చేస్తామని హామీ ఇచ్చినా.. నేటికీ ఒక్క జీవో కూడా విడుదల చేయకపోవడం సిగ్గు చేటని తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోవడంవల్లే రేషన్ డీలర్లు సమ్మె చేయాల్సి వచ్చంది. రేషన్ డీలర్ల సమ్మె వల్ల పేద ప్రజలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. పేదలకు బియ్యం అందించలేని దుస్థితి ఏర్పడింది. రాష్ట్రంలో 91 లక్షల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Ukraine-Russia: ఉక్రెయిన్ లో భారీ డ్యామ్ కూల్చివేత.. రష్యానే చేసిందని ఆరోపణ..
Also Read
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేస్తున్నా వాటిని పేదలకు అందించకుండా కేసీఆర్ ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ఆరోపించారు. రేషన్ డీలర్లు కోవిడ్ టైంలో కూడా ప్రాణాలకు తెగించి పనిచేశారని గుర్తు చేశారు. ఏ ఒక్కరూ పస్తులుండకూడదనే ఉద్దేశంతో నరేంద్రమోద ప్రభుత్వం దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం కేటాయిస్తే తెలంగాణలో పేదలందరికీ రేషన్ డీలర్లు బియ్యం అందిస్తూ సేవలందించారని అన్నారు. రేషన్ డీలర్లకు ఇచ్చే కమీషన్ లో సగం మొత్తాన్ని కేంద్రమే చెల్లిస్తోందని అన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్రం ఠంచన్ గా కమీషన్ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లిస్తోందని తెలిపారు. అయినా ఆ సొమ్మును డీలర్లకు ఇవ్వకుండా సొంత అవసరాలకు వాడుకుంటూ డీలర్లకు సకాలంలో చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. వడ్ల కొనుగోలు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అలసత్వం వహిస్తూ రైతులతో చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలుకయ్యే సొమ్మునంతా కేంద్రమే చెల్లిస్తోందని తెలిపారు. వడ్లను సేకరించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కమీషన్ కూడా ఇస్తోందని తెలిపారు. అయినా నేటికీ రైతుల నుండి వడ్లను కొనుగోలు చేయకుండా కళ్లెల వద్ద పడిగాపులు కాసేలా చేస్తూ వాళ్ల ఉసురు తీస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రేషన్ డీలర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పంతాలు పట్టింపులకు పోయి సమ్మెను పరిష్కరించకుండా పేదల నోటికాడ మద్దను లాక్కోవాలని చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Elon Musk: 200 రోజుల్లో 200 బిలియన్ డాలర్ల సంపద.. మస్కా మజాకా
తాజావార్తలు
-
Telangana SIR : తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు.. 12,204 ఓట్లు డిలీట్
-
Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
-
Nadendla Manohar : నాదెండ్ల మనోహర్ ఫైర్.. వైసీపీకి 11 సీట్లు కూడా రావంటూ వార్నింగ్.!
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!