NTV Telugu Site icon

Ration Card E-KYC: ముగుస్తున్న రేషన్‌ కార్డుల ఈ-కేవైసీ గడువు.. మరో మూడు రోజులే ఛాన్స్‌

Ration Card E Kyc

Ration Card E Kyc

Ration Card E-KYC: బోగస్ రేషన్ కార్డుల నిర్మూలన కోసం తెలంగాణ ప్రభుత్వం కొన్ని నెలల క్రితం ఈ-కేవైసీ ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బోగస్ కార్డుల సృష్టికి శ్రీకారం చుట్టిన రేషన్ కార్డు ఈ-కేవైసీ గడువు దగ్గరపడుతోంది. మరో మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానుంది. కేంద్రం ఆదేశాల మేరకు రేషన్ కార్డుదారులు అసలు లబ్ధిదారులను గుర్తించేందుకు జనవరి 31లోగా ఈ-కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రకటించినా.. మళ్లీ తాజాగా ఈ గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్ కార్డ్ ఇ-కెవైసి ఇంకా పూర్తి చేయని వారికి ఫిబ్రవరి నెలాఖరు వరకు పొడిగించారు. దీంతో గడుపు తేదీ దగ్గర పడుతుండటంతో అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేశారు. మూడురోజుల్లో ఈ-కేవైసీని తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు.

Read also: TS Inter Exams: ఇంటర్ విద్యార్థులు అలర్ట్‌.. పరీక్షల్లో కాపీ కొడితే క్రిమినల్ కేసు..!

తెలంగాణలో 75.76 శాతం మంది రేషన్ కార్డు ఈ-కేవైసీ పూర్తి చేశారు. ఇంకా 25 శాతం మిగిలి ఉన్నాయి. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఇంకా e-KYCని పూర్తి చేయలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ గడువును పొడిగించింది. దీని ప్రకారం తెలంగాణ ప్రభుత్వం కూడా గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా వేలిముద్రలు ఇచ్చి ఈ-కేవైసీ పూర్తి చేయని వారు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 100 శాతం ఈ-కేవైసీ పూర్తయ్యేలా చూడాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ అధికారులకు సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు, హైదరాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.

Read also: Telangana Weather: కూల్‌ కూల్‌ గా వాతావరణం.. అక్కడక్కడ చిరు జల్లులు..

ఇ-కెవైసి ఎలా చేసుకోవాలి?

రేషన్ కార్డులో పేరున్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి మీ రేషన్ కార్డు నంబర్ మరియు వేలిముద్రలు ఇవ్వాలి. ఇది మీ రేషన్ కార్డ్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేస్తుంది. ఆ తర్వాత మీరు ఇ-కెవైసిని పూర్తి చేసినట్లు ఇపిఒఎస్ మిషన్ నుండి చిన్న రసీదు కూడా అందుకుంటారు. ఈ ప్రక్రియ చాలా సులభం. తెలంగాణలోని రేషన్ కార్డ్ హోల్డర్లు రాష్ట్రవ్యాప్తంగా ఏ రేషన్ షాపుకైనా వెళ్లి ఇ-కేవైసీని పూర్తి చేయవచ్చు. అలాగే కుటుంబ సభ్యులందరూ ఒకేసారి వెళ్లి వేలిముద్రలు వేయాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా.. ఎక్కడైనా e-KYCని పూర్తి చేయవచ్చు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?