Site icon NTV Telugu

Ranjith Reddy: వేదికపై అలా మాట్లాడటం సరికాదు.. అస్సాం సీఎంపై రంజీత్ రెడ్డి సీరియస్‌

Ranjithreddy

Ranjithreddy

Ranjeet Reddy is serious about Assam CM: ముఖ్య మంత్రి స్థాయి లో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. బుర్ర పని చేయకుండా మాట్లాడం సరికాదన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ ప్రజల‌‌ మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ నాయకులు పూనుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపై బిస్వా శర్మ మాట్లాడిన‌ మటాలను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. నేను ఒక్కడినే కాదు ప్రజలంతా ఖండిస్తున్నారని తెలిపారు. ఏ వేదిక పై.. ఏమి‌ మాట్లాడాలో బీజేపీ నాయకులు నేర్చుకోవాలని మండిపడ్డారు. గండిపేట మండలం అల్కాపూరీ కాలనీ లో 3.6 కోట్ల తో నిర్మించిన తలపెట్టిన రిజర్వాయర్ కు స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో రంజీత్ రెడ్డి కలసి భూమి పూజ చేసారు. త్వరలోనే రిజర్వాయర్ మూడు మునిసిపల్ కార్పొరేషన్ ప్రజల‌ దాహార్తిని తీర్చనున్నదని అన్నారు. ఎన్నో ఎండ్ల నాటి కల సహకారం అయిందని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి నీళ్ల కుళాయి అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 2.3 ఎమ్ఎల్ కెపాసిటి కలిగిన రిజర్వాయర్ ను 6 నెలల లోపు నిర్మాణం పూర్తి అవుతుందని, ప్రజలకు అందుబాటులో ఉండి అందరూ కలసి కట్టుతో ‌ముందుకు సాగుతామని రంజిత్‌ రెడ్డి తెలిపారు.

అస్సాం సీఎం నిన్న మాట్లాడిన మాటలకు మంత్రి తలసాని సీరియస్ అయిన విషయం తెలిసిందే.. హైదరాబాద్ ప్రజల్ని రెచ్చగొట్టడానికి అసోం సీఎంను తెలంగాణకు తెచ్చారని అన్నారు. తాము కూడా అసోం వెళ్లి మాట్లాడగలమని హెచ్చరించారు. సీఎం లాంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి.. హైదరాబాద్‌కు ఏ ఉద్దేశంతో వచ్చారో, దానిపై దృష్టి సారిస్తే బాగుంటుందని సూచించారు. ఆయన వాడిన అసభ్యకరమైన పదజాలాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసోం సీఎం వల్గర్‌గా మాట్లాడినందుకే, టీఆర్ఎస్ నేత మైక్ లాగేయడం జరిగిందని తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ని చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుండడం బాధాకరమైన విషయమన్నారు. అక్కడ వేదిక, మైక్ ఏర్పాట్లన్నీ చేసింది ప్రభుత్వమేనని గుర్తు చేశారు.

నిమజ్జనం కార్యక్రమానికి వచ్చి, భక్తి గురించి మాట్లాడకుండా, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా? అని తలసాని నిలదీశారు. నాలుగైదు రోజుల నుంచి నిమజ్జన ఏర్పాటను కావాలనే రాజకీయం చేసినా, తాము మాట్లాడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా మాట్లాడుతూ.. అసోం సీఎం చేసింది తప్పు.. బాధ్యతాయుత పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నారు? అని మండిపడ్డారు అసోం సీఎం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని మండిపడ్డారు. నిమజ్జనం ఏర్పాట్లపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని తెలిపిన విషయం తెలిసిందే..
Bharat Jodo Yatra: మరో వివాదంలో రాహుల్ గాంధీ.. ఆ వ్యక్తిని కలవడంపై బీజేపీ విమర్శలు

Exit mobile version