Moinabad Mujra Party: పార్టీ పేరుతో గలీజు దందా.. ఢిల్లీ నుంచి అమ్మాయిలు..

  • మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ భగ్నం..
  • 12 మంది యువకులు- నలుగురు యువతుల అరెస్ట్‌..
  • ముజ్రా పార్టీ కోసం యువతులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన యువకులు..
  • అర్థనగ్న డ్యాన్సులు చేస్తుండగా పట్టుకున్న ఎస్‌ఓటీ పోలీసులు..
Mujra Party Rangareddy

Mujra Party Rangareddy

Moinabad Mujra Party: హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో అర్ధరాత్రి జరిగిన అసభ్యకరమైన పార్టీ ఘటన వెలుగులోకి వచ్చింది. మొయినాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో ముజ్రా పార్టీ ఏర్పాటు చేసి అమ్మాయిలతో నగ్నంగా డ్యాన్స్ చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్‌వోటీ పోలీసులు ఫాంహౌస్‌పై దాడి చేశారు. పార్టీలో పాల్గొన్న ఏడుగురు యువకులు, నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ముజ్రా పార్టీ కోసం యువతులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చారన్నారు. అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న నృత్యాలు చేస్తూ పట్టుబడ్డామని తెలిపారు. వారిని మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. మరోవైపు హైదరాబాద్ శివారులోని ఫామ్ హౌస్ లలో వారాంతాల్లో అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఫాంహౌస్ పేరుతో నిర్వాహకులు గలీజ్ దందా నిర్వహిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా యువతకు మత్తు పదార్థాలు అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అందమైన అమ్మాయిలను తీసుకొచ్చి అసభ్యంగా, అర్ధనగ్నంగా నృత్యాలు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

Read also: NTV Effect: జేఎన్టీయూ ఘటనపై మంత్రి దామోదర రాజనరసింహ సీరియస్‌. క్యాంపస్‌ కు అడిషనల్ కలెక్టర్..

ఇటీవల ఖాజాగూడలోని ది కేవ్‌ పబ్‌లో డ్రగ్స్‌, గంజాయి వినియోగదారులను ప్రోత్సహించేందుకు ఓ ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. పాల్గొన్న వారిలో డ్రగ్స్ వాడిన 24 మంది పట్టుబడడం గమనార్హం. 20 రోజుల క్రితం మాదాపూర్‌లోని ఓ పబ్‌లో డీజే డ్రగ్స్ తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. గత మూడు వారాల్లో నమోదైన రెండు డ్రగ్స్ కేసులు కూడా పబ్బులే కేంద్రాలుగా మారడమే ఇందుకు నిదర్శనం. పబ్బుల్లో పనిచేసే డీజేలు ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ తెస్తున్నారని టాక్. ఈవెంట్ల కోసం తరచూ వివిధ నగరాలకు వెళ్లే డీజేలు కొందరు డ్రగ్స్ తెచ్చి పబ్బుల్లో కలిసే వ్యక్తులకు విక్రయిస్తున్నారు. ఈ శనివారం అర్ధరాత్రి ది కేవ్ పబ్‌లో జూన్ 16న మాదాపూర్‌లోని ఓ పబ్‌లో డ్రగ్ టెస్ట్‌లో ముగ్గురు డీజేలు పట్టుబడ్డారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లోని ఐదు పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు టీజీఎన్‌ఏబీ పోలీసులు గుర్తించారు.
Relese clash: పండగ రేస్ లో ఎవరు పైచేయి సాధిస్తారో..?