NTV Telugu Site icon

Hyderabad: అదనపు కట్నం వేధింపులకు వివాహిత బలి..

Dowry Harassment.

Dowry Harassment.

పెళ్లి అనే బంధంతో అత్తారింట్లోకి అడుగుపెట్టి.. భర్త, పిల్లలు, అత్తమామలతో జీవితాంతం హాయిగా ఉండాలని కలలు గన్న ఆ వివాహిత ఆశలు కల్లలయ్యాయి. పెళ్లై 2 సంవత్సరాల పాప కల్గినా భర్త, అత్తమామల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు, సూటి పోటి మాటలు, శారీరక, మానసిక హింస.. ఇవన్నీ పిల్లల కోసం పంటి బిగువన భరించింది. వేధింపులు భరించలేని స్థితికి చేరడంతో చివరకు వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

వివరాల్లోకి వెళ్తే.. అదనపు కట్నం వేధింపులకు ఓ వివాహిత బలి అయింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అమ్రేష్, స్వప్న భార్యాభర్తలు. వీరు గత కొంత కాలంగా అత్తాపూర్ పాండు రంగానగర్‌లో నివసిస్తున్నారు. వీరికి 2 సంవత్సరల పాప కూడా ఉంది. భర్త అమ్రేష్ టిక్ టాక్ అనే MNC కంపెనీలో పని చేస్తున్నాడు. వివాహ సమయంలో 7 తులాల బంగారం 50,000 నగదును స్వప్న కుటుంబ సభ్యులు కట్నంగా ఇచ్చారు. అయితే.. పెళ్లయిన ఏడాది తర్వాతి నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. దీంతో.. శారీరకంగా, మానసికంగా విసిగిపోయిన స్వప్న.. సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also: Telangana: నేటి నుంచి ఒంటిపూట బడులు.. మధ్యాహ్నం 12.30 వరకే