NTV Telugu Site icon

Hyderabad: సొంత అక్కని చంపుతాడని అనుకోలేదు.. మృతురాలు నాగమణి భర్త

Hyd

Hyd

Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ గ్రామంలో మహిళ కానిస్టేబుల్ నాగమణిని ఆమె తమ్ముడు దారుణంగా నరికి చంపాడు. ఈ ఘటనపై Ntvతో మృతురాలు భర్త శ్రీకాంత్ మాట్లాడుతూ.. పరమేశ్ తమను చంపుతాడని తెలుసు.. కులంతర వివాహం చేసుకోవడంతోనే అతను నాగమణిపై కక్ష్య పెంచుకున్నాడని పేర్కొన్నాడు. పెళ్ళి చేసుకొని వచ్చిన తరువాత పోలిస్ స్టేషన్ బయటే మమ్మల్ని బెదిరించాడని ఆరోపించాడు. కానీ సొంత అక్క నాగమణినే చంపుతాడని అస్సలు ఊహించలేదని చెప్పుకొచ్చారు. నిన్న ఆదివారం సెలవు కావడంతో ఊరికి వచ్చాం.. అయితే, నాగమణి కంటే 10 నిమిషాల ముందే నేను బయల్దేరాను.. నాతో ఫోన్ లో మాట్లాడుతుండగానే ఆమెను పరమేశ్ కారుతో ఢీ కొట్టాడు.. నన్ను మా తమ్ముడు చంపడానికి వచ్చాడంటూ చెప్పింది అని మృతురాలి భర్త శ్రీకాంత్ వెల్లడించాడు.

Read Also: Actress Shobhita : నటి శోభిత ఆత్మహత్యకేసులో కీలక మలుపు

ఇక, వెంటనే మా అన్నయ్యను వెళ్ళమని చెప్పాను అప్పటికే రక్తపు మడుగులో నాగమణి పడి ఉంది.. ఘటనా స్థలానికి వెళ్ళేలోపే చనిపోయింది అని ఆమె భర్త శ్రీకాంత్ తెలిపాడు. అయితే, కానిస్టేబుల్ నాగమణిని చంపిన పరమేశ్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం మూడు టీమ్ లు ఏర్పాటు చేశామని పోలీసులు తెలిపారు. సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతన్ని పట్టుకేనేందుకు గాలిస్తున్నాం.. నాగమణి భర్త ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.. ఈ హత్యలో పరమేశ్ ఒక్కడే ఉన్నాడా లేక అతనికి ఇంకెవరైనా సహకరించారా అనేది తెలుస్తుంది అని పోలీసులు పేర్కొన్నారు.