Ranga Reddy Crime: డబ్బుకోసం కుటుంబ సభ్యులనే కడతేర్చే కాలం చూడాల్సి వస్తోంది. కుటుంబం అంటే ఆత్మీయత అనురాగం ఈకాలంలో కరువయ్యాయి. డబ్బు, ఆస్తి వుంటే చాలు ఎవరున్న లేకున్నదాంతో బతికేయెచ్చనే ఆలోచనతో బతికేస్తున్నారు. ఆస్తికోసం కన్నతల్లిదండ్రులను, భార్యను, కన్నకొడుకును, అత్తమామ ఇలా రక్తసంబంధం అని చూడకుండా చంపేందుకు కూడా వెనుకడాటం లేదు. ఇలాంటి ఘటనే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సులేమాన్ నగర్‌లో జరిగింది. ఆస్తికోసం తండ్రి కొడుకు ఒకరొనొకరు దాడి చేసుకున్నారు.
రాత్రి ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గత కొంత కాలంగా ఆస్తి తన పేరు పై రాయాలని కొడుకు తండ్రిపై ఒత్తిడి చేస్తుండటంతో.. తండ్రి ససేమిరా అన్నాడు. దీంతో రాత్రి మళ్లీ ఆస్తి వివాదం మొదటికి వచ్చింది. వివాదం కాస్తా తారా స్థాయికి చేరుకోవడంతో తండ్రి కొడుకులు పరస్పర దాడులు చేసుకున్నారు. తండ్రి ఖలీమ్ పై బండరాయితో కొడుకు మతీన్ దాడి చేయడంతో.. తలకు బలమైన గాయమైంది. దీంతో సహనం కోల్పోయిన తండ్రి పక్కనే ఉన్న గాజు ముక్కతో కొడుకు మతీన్ గొంతుపై విచక్షణారహితంగా పొడిచాడు. స్థానికులు గమనించి ఇద్దరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
Lakshmi Kataksham Bhakthi Tv Live: మీరు కోరిన కోరికలు తీరి లక్ష్మీ కటాక్షం పొందాలంటే..