NTV Telugu Site icon

CM Revanth Reddy: రంగారెడ్డిలో సీఎం పర్యటన.. ‘కాటమయ్య రక్ష’ కిట్లను ప్రారంభం..

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: ప్రభుత్వం ‘కాటమయ్య రక్ష’ కిట్లను నేడు అందించనుంది. ఈ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌‌మెట్ మండలం లష్కర్‌‌గూడ గ్రామంలో సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం సుమారు 60 మంది గీత కార్మికులకు సీఎం చేతుల మీదుగా వీటి పంపిణీ చేయనున్నారు గౌడన్నలతో సమావేశం అనంతరం అక్కడే వారితో కలిసి సీఎం సహపంక్తి భోజనం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గౌడన్నలకు కాటమయ్య రక్ష కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.

Read also: Jammu Kashmir : 200 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు.. ముగ్గురు మృతి, 24 మందికి గాయాలు

చెట్టు ఎక్కి కల్లు గీసే క్రమంలో చాలాసార్లు ప్రమాదాల బారిన పడి గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని గ్రహించింది. ఈ ప్రమాదాలను నివారించేందుకు ఆధునికతను జోడించి సేఫ్టీ కిట్లను హైదరాబాద్‌ ఐఐటీతో కలిసి ఓ ప్రైవేటు సంస్థ తయారు చేసింది. గీత కార్మికులు సులువుగా తాళ్లు ఎక్కేలా ఈ కిట్లను రూపొందించారు. ప్రమాదవశాత్తు తాటి చెట్ల మీద నుంచి కింద పడకుండా ఈ పరికరాల్లో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారు. ఒక్కో కిట్‌లో మొత్తం 6 పరికరాలు ఉంటాయి. తాడు, క్లిప్పులు, హ్యాండిల్స్‌, స్లింగ్ బ్యాగ్, లెగ్‌ లూప్ వంటివన్నీ వేర్వేరుగా ఉంటాయి. ప్రస్తుతం గీత కార్మికులు ఉపయోగిస్తున్న సాంప్రదాయ కిట్ల తరహాలోనే, యూజర్ ఫ్రెండ్లీగా ఈ పరికరాలు ఉంటాయి.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే.?