Site icon NTV Telugu

Chevella MP Ranjith Reddy: బీఆర్‌ఎస్‌ కు బిగ్ షాక్.. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా..!

Ranjith Reddy

Ranjith Reddy

Chevella MP Ranjith Reddy: ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌కు మరో సంచలన షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. అనంతరం సోషల్ మీడియా ద్వారా తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేస్తున్నాను. ఇప్పటి వరకు పార్టీలో తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు. ఇన్ని రోజులు చేవెళ్ల ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన కేసీఆర్, కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు.

Read also: Hanuman OTT: అభిమానులకు శుభవార్త.. ఓటీటీలోకి వచ్చేసిన హనుమాన్! స్ట్రీమింగ్ ఎక్కడంటే?

అనంతరం రంజిత్ రెడ్డి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా గులాబీ అధినేతను అభ్యర్థించారు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇన్ని రోజులు పార్టీలో నా చేవెళ్ల ప్రజలకి సేవ చేసేందుకు అవకాశాలు కల్పించిన పార్టీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా రాజీనామా ఆమోదించాలని ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ఇన్నాళ్లూ నాకు పార్టీలో సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ లో చేవెళ్ళ మాజీ ఎమ్.పి రంజిత్ రెడ్డి చేరనున్నట్లు ప్రకటించారు. చేవెళ్ళ లోకసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి ఖరారు చేసినట్లు సమాచారం. రేపు జరిగే కాంగ్రెస్ పార్టీ సిఈసి సమావేశంలో రంజిత్ రెడ్జి అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలుపనున్నట్లు సమాచారం.

Viral Video : అబ్బా.. తమ్ముడు ఏం టాలెంట్.. పెనం మీదకే పరోటా..

Exit mobile version