BRS KTR: మాజీమంత్రి కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న సాయంత్రం కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కేటీఆర్ కలిశారు. అమృత్ టెండర్లలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. అనంతరం దీనిపై ఇవాళ ఉదయం 11 గంటలకు కేటీఆర్ ప్రెస్ మీట్ లో మాట్లాడనున్నారు. కాగా.. అమృత్ పథకం టెండర్లలో పలు నేతలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ ఆరోపించారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి వారి కుటుంబ సభ్యులకే కంపెనీకి రూ. 1,137 కోట్ల విలువ చేసే పనులను అప్పగించారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అనే నిబంధనను ఉల్లఘించిన వారు ఎంతటి వారైనా వారిపై వేటు వేయొచ్చని కేటీఆర్ తెలిపారు. దీనికి సంబంధించి పలు కేసులను కూడా ఆయన వెల్లడించారు. టెండర్లలో చట్టవిరుద్దంగా జరిగిన కేటాయింపులు, అక్రమ ఒప్పందాలపై విచారణ జరపాలని, అక్రమాలు నిజమని తేలితే టెండర్లు రద్దు చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read also: Atrocious: నగరంలో దారుణం.. భార్యను గొంతు కోసి తగలబెట్టిన భర్త..
మరోవైపు కేటీఆర్ ఈ సందర్భంగా ఢిల్లీ చేరుకోగానే ‘X’లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ‘ఇప్పుడే ఢిల్లీలో అడుగు పెట్టా.. హైదరాబాద్‌లో అప్పుడే వణికిపోతే ఎలా?.. హైదరాబాద్‌లో ప్రకంపనలు కనిపిస్తున్నాయి’. అని కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు.. కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయింలో విమర్శలు చేస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని కలిసి కేసులు విత్ డ్రా చేసుకునేందుకు ఢిల్లీ వెళ్ళారా.. మీ తప్పులు మాఫీ చేయించుకునేందుకు బీజేపీ నేతలను కలవడానికి ఢిల్లీ వెళ్లారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై కేటీఆర్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
Warangal: నేడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకానున్న ఎమ్మార్వోలు.. ఏం జరిగింది..