Temple Incident : అమ్మవారి గుడిలో అర్చకుడి దారుణం.. బయట తాళం.. లోపల వికృత చేష్టలు
- గుడికి బయట తాళం.. లోపల వికృత చేష్టలు
- స్థానికుల నిఘాతో బయటపడ్డ దారుణం
- వీడియో ఆధారాలతో పోలీసులకు సమాచారం
- అర్చకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దైవచింతనతో గడపాల్సిన వయసులో, భక్తిని పెంపొందించాల్సిన గుడి ప్రాంగణాన్ని ఒక వృద్ధుడు తన వికృత చేష్టలకు వేదికగా మార్చుకోవడం స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిమితుల్లో వెలుగు చూసిన ఈ సంఘటన మానవత్వానికే మచ్చలా నిలిచింది. ఆలయ అర్చకుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సాయన్న అనే వృద్ధుడు, కనీస భయభక్తులు లేకుండా ప్రవర్తించిన తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
తాళం బయట.. అసాంఘిక పనులు లోపల
గుడిలోని అమ్మవారి విగ్రహం ముందే ఒక మైనర్ బాలికతో సాయన్న అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించసాగాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఆలయానికి బయటి వైపు తాళం వేసి, లోపల ఈ అసాంఘిక కార్యకలాపాలకు ఒడిగట్టడం అతని దారుణ ఆలోచనకు అద్దం పడుతోంది. అయితే, అతడి వికృత కదలికలను గమనించిన స్థానికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిఘా పెట్టారు. కిటికీలు లేదా సందుల ద్వారా లోపల జరుగుతున్న దారుణాన్ని తమ మొబైల్ ఫోన్లలో వీడియో రికార్డ్ చేసి పక్కా ఆధారాలు సేకరించారు.
Also Read
- Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- TGSRTC Union Elections: పదేళ్ల తర్వాత ఆర్టీసీ ఎన్నికలు.. మొదలైన పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే?
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
స్థానికుల సమయస్ఫూర్తి.. ఊచలు లెక్కిస్తున్న వృద్ధుడు
ఘటనను గమనించిన గ్రామ పెద్దలు, స్థానికులు వెనువెంటనే అప్రమత్తమై రామచంద్రాపురం పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు సదరు వృద్ధుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం సదరు బాధితురాలైన మైనర్ బాలిక వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. దేవుడి పేరిట కొలువుంటూ గుడి పవిత్రతను మైలపరచిన ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును వీలైనంత త్వరగా ముగించి కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bengal: నందిగ్రామ్ బైపోల్లో భారీ స్థాయిలో బీజేపీకి ఆధిక్యం.. గత రికార్డ్ బద్దలు
-
Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
-
Maharashtra: మహా ఘోరం.. నదిలో ఇనుప గొలుసులతో తేలియాడిన ప్రేమికుల మృతదేహాలు
-
Ponguleti Srinivas :22-ఎ భూములపై ప్రభుత్వం గుడ్న్యూస్.. నెల రోజుల్లోనే పరిష్కారం
-
Arvind Kejriwal: సీజేపీ నిరసనల్లో కుటుంబంతో పాల్గొంటున్న కేజ్రీవాల్..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు