మోడీ తెలంగాణ ను అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాల పై మోడీ రాజ్య సభలో మాట్లాడారని, టీఆర్‌ఎస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సెంటిమెంటును రెచ్చగొట్టి ప్రజల దృష్టిని మరల్చాలని చూస్తుందని, అది జరగదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీకి అధికార ప్రతినిధిగా మారిందని, కేసీఆర్ సర్కారు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకునేందుకు అబద్దాలు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు ఆపాలని ఆయన అన్నారు.
డీజీపీ వెంటనే స్పందించాలని ఆయన కోరారు. అంతేకాకుండా తెలంగాణ బిల్లుకి బీజేపీ మద్దత్తు ఇచ్చిందని, బిల్లులో లోపాలు ఉన్న తెలంగాణను దృష్టిలో పెట్టుకొని … బిల్లు పాస్ అయ్యేందుకు సహకరించిందని ఆయన అన్నారు. ఓ వారం ముందు బిల్లు పెడితే విభజన సమస్యలు ఉండక పోయేవి అని ఆయన వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు ఇంకా పరిస్కారం కాకపోవడానికి టీఆర్‌ఎస్ సర్కార్ కూడా కారణమని ఆయన ఆరోపించారు.
