Site icon NTV Telugu

BJP MLA Raja Singh: ధర్మం కన్నా పార్టీ ముఖ్యం కాదు.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు..

Munawar Faruqui, Rajasingh

Munawar Faruqui, Rajasingh

స్టాండ్ ఆప్ కమెడియన్ మునావర్ ఫరూఖీ షో ను అడ్డుకుంటామని ఇప్పటికే మా కార్యకర్తలు ఆన్లైన్ లో టికెట్ లు తీసుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచళన వ్యాఖ్యలు చేసారు. షో లోపలే మునావర్ ఫరూకీ పై దాడి చేస్తామని వెల్లడించారు. శాంతి భద్రతల సమస్య తలెత్తితే, డీజీపీ, ప్రభుత్వం బాధ్యత వహించాలని రాజాసింగ్‌ తెలిపారు. బీజేపీ పార్టీ నాయకులు వద్దన్నా.. నేను షోను అడ్డుకుని తీరుతా అంటూ మండిపడ్డారు.

ధర్మం కన్నా.. నాకు పార్టీ ముఖ్యం కాదని సంచళన వ్యాఖ్యలు చేసారు రాజాసింగ్‌.. హిందూ దేవుళ్ళను కించపరిచే వారి కామెడీ షో లకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని ప్రశ్నించారు. మునావర్ ఫారూకీ షో జరిగితే.. మరుసటి రోజు నా సమాధానం కూడా గట్టిగానే వుంటుందని హెచ్చరించారు. తన వల్ల ఇప్పటి వరకు శాంతి భద్రతల సమస్య ఎక్కడా రాలేదని అన్నారు. కానీ.. ఇప్పుడు మునావర్‌ ఫరూఖీ షో ను అడ్డుకుంటే అది నా బాధ్యత కాదని, ఫారూఖీ షో ను అడ్డుకోవాలని పిలుపు ఇవ్వడంతో.. ఉద్రిక్తతకు దారితీసే పరిస్థితులు వుంటాయని, ముందు జాగ్రత్తగా రాజా సింగ్ ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
Accident: షుగర్‌ ఫ్యాక్టరీలో పేలుడు.. ముగ్గురు మృతి

Exit mobile version