NTV Telugu Site icon

Rajanna Sircilla: బరితెగించిన కాంట్రాక్టర్‌.. కొడుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని తీసుకెళ్లి నిర్బంధం..

Rajanna Sirisilla

Rajanna Sirisilla

Rajanna Sircilla: తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రీ తల్లిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అమానవీయ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్య క్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. వేములవాడ అర్బన్ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పల్లపు శ్రీను అనే వ్యక్తి బండ పని మేస్త్రీగా పనిచే స్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన లాలు దేవకర్ అండ్ టీం కర్ణాటకలో చెరుకు తోటలను కోసే పనులను కాంట్రాక్టు తీసుకున్నారు. ఇందుకోసం కూలీలు అవసరం ఉండగా.. శ్రీను. అతడి సోద రుడిని సంప్రదించారు. ప్రస్తుతం శ్రీను, అతని సోదరుడు చత్తీస్ గఢ్ లో కూలీ పనులు చేస్తున్నారు. అయితే లాలు దేవకర్ కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావాల్సిన లేబర్ లను పురమాయించేందుకు చత్తీస్ గఢ్ కు చెందిన కూలీలతో శ్రీను ఒప్పందం కుదిర్చాడు. దీనికి మధ్య వర్తిత్వంగా శ్రీను వ్యవహరించాడు. ఇందుకోసం లాలు దేవకర్ రూ.3.80 లక్షలను కూలీలకు చెల్లించాడు.

Read also: Mallu Bhatti Vikramarka: మేము వచ్చాక ఆ లక్ష్యాలను చేరుకుంటున్నాం..

కానీ కూలీలు పనులకు రాకపోవడంతో లాలు దేవకర్ కు, కొడుముంజకు చెందిన శ్రీను, అతడి సోదరునికి మధ్య వివాదం చోటుచేసుకుంది. తన డబ్బులు తిరిగి చెల్లించాల ని లాలు దేవకర్ శ్రీను అతడి సోదరుడిపై ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో బుధవారం లాలు దేవకర్, మరికొంత మంది కొడుముంజ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని శ్రీను ఇంటికి వచ్చారు. శ్రీను.. అతడి సోదరుడు ఇంటి వద్ద లేకపోవడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఉన్న శ్రీను తల్లి అయిన పల్లపు భీమా బాయ్ ను బలవంతంగా కారులోకి ఎక్కించి కిడ్నాప్ కు పాల్పడ్డారు. డబ్బులిచ్చి తల్లిని తీసుకెళ్లాలంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనారోగ్యంతో ఉన్న భీమా బాయ్ ను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లాలు దేవకర్ అతని అనుచరు లు దౌర్జన్యంగా భీమా బాయ్ ను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ సీఐ వీర ప్రసాద్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించారు. పల్లపు భీమా బాయ్ ను ఎత్తుకెళ్లిన వారు మహారాష్ట్ర వెళ్లినట్లు సమాచారం సేకరించి పోలీసులు వారిని పట్టుకునే పనిలో పడ్డారు.
Khammam: ఖమ్మంలో ఘరానా మోసం.. ఏటీఎం నగదు బదిలీలో ఆరితేరిన ఆ ముగ్గురు..