NTV Telugu Site icon

Adi Srinivas: హరీష్‌ రావుపై బండి సంజయ్ ప్రశంసలు.. బీజేపీ ప్లాన్ అదే?

Adi Srinivas

Adi Srinivas

Adi Srinivas: హరీష్ రావును బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక.. బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారని.. రాష్ట్ర ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని మండిపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే.. హరీష్​ రావును అడ్డంపెట్టుకొని భ్రష్టు రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు.

Read also: PM Modi: ఐక్యరాజ్య సమితిలో ప్రధాని మోడీ ప్రసంగం.. ఎప్పుడంటే..?

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల రహస్య ఒప్పందాలకు నెమ్మదిగా తెర దించుతున్నాయన్నారు.. ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావు బీజేపీతో సంప్రదింపులు జరిపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావును పొగడ్తలతో ముంచెత్తడం వెనుక.. ఆయనతో రాజీనామా చేయించి.. బీజేపీ తరపున పోటీ చేయించే ఆలోచన ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా సిద్దిపేటలో హరీష్ రావు మళ్లీ గెలుస్తాడని బండి సంజయ్ అంటున్నారని తెలిపారు. హరీష్​రావు పై వచ్చిన పొగడ్తలను బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సమర్ధిస్తారా..? అని ప్రశ్నించారు. ఆ నేతల వ్యాఖ్యలను వరుసగా పరిశీలిస్తే మెద‌క్ లో బీజేపీ, బీఆర్ఎస్‌లు కుమ్మక్కైయ్యాయని అర్ధమవుతుందని స్పష్టం చేశారు.
Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. మరోసారి 74 వేల మార్క్‌ను దాటింది !

Show comments