NTV Telugu Site icon

Ponnam Prabhakar: బండి సంజయ్, పురందేశ్వరిపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు..

Ponnam

Ponnam

కేంద్రమంత్రి బండి సంజయ్, బీజేపీ ఎంపీ పురందేశ్వరిపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో అల్లు అర్జున్ పై ఆయన మాట్లాడుతూ.. అల్లు అర్జున్ విషయంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారన్నారు. అల్లు అర్జున్ విషయంలో తమకు ఎలాంటి కక్షసాధింపు లేదని చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. శ్రీ తేజ కుటుంబాన్ని పరామర్శించి.. వాళ్ల పరిస్థితిని చూసి కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించాలని మంత్రి పేర్కొన్నారు.

Read Also: K.A.Paul: సినిమాతో వచ్చిన లాభం మొత్తం రేవతి కుటుంబానికి ఇవ్వాలి..

ఏపీ టీడీపీ చీఫ్ విప్ పల్లా శ్రీనివాస్, బీజేపీ ఎంపీ పురందేశ్వరి వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. వాళ్ళు వాళ్ళ రాష్ట్రాల్లో జరిగే అంశాలు చూసుకుంటే బాగుంటుందని చెప్పారు. సోషల్ మీడియాలో ఇంటర్నేషనల్ క్లాసెస్ చూసుకోండి.. ముందు మీ రాష్ట్రానికి పరిమితమై సేవల గురించి ఆలోచన చేయండని సూచించారు. పురందేశ్వరికి అంత హ్యూమన్ టచ్ ఉంటే పార్లమెంటులో జరిగిన దాడి సంఘటనలో.. రాహుల్ గాంధీపై హత్యాయత్నం కేసు పై పురేందరేశ్వరి సమాధానం చెప్పాలన్నారు.

Read Also: K.A.Paul: సినిమాతో వచ్చిన లాభం మొత్తం రేవతి కుటుంబానికి ఇవ్వాలి..

పార్లమెంటు వేదికగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను.. బీజేపీ అధిష్టానం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షాను ఎందుకు తప్పు పట్టడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇదే ఎన్టీరామారావు అంటే మీరు ఊరుకుంటారా పురందేశ్వరి అని ఫైరయ్యారు. దమ్ముంటే బండి సంజయ్, పురందేశ్వరి.. అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మాట్లాడాలని మంత్రి పొన్నం తెలిపారు.