Site icon NTV Telugu

KTR: వారికి వారే చంపుకుంటున్నారు.. జగిత్యాల ఘటనపై కేటీఆర్‌ కీలక కామెంట్..

Rajanna Siricilla

Rajanna Siricilla

KTR: రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. అనంతరం ఆయన కాంగ్రెస్ కార్యకర్తలపై కీలక వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచిత విద్యుత్ పేరుతో కాంగ్రెస్ ఉన్నా విద్యుత్ పోగొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. పేద మధ్య తరగతి కుటుంబాల నడ్డి విరిచేందుకు ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ, అంబానీ లకు సిరిసిల్ల నేతన్న లకి ఒకే కేటగిరి ఎలా? అని ప్రశ్నించారు. దేశంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం.. పైసా పెంచలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల భారంగా మారాయన్నారు. గత పదేళ్లుగా ఆత్మహత్యలు లేవు, కానీ 10 నెల్లలో 10 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బుర్ర, బుద్ది మార్చకోవాలని కేటీఆర్ సూచించారు.

Read also: Kishan Reddy: వాటిని కూల్చే దమ్ము ఉందా ? రేవంత్ రెడ్డి కి కిషన్ రెడ్డి సవాల్..

దీపావళి ముందే బాంబులు పెళుతాయని అని పొంగులేటి కామెంట్స్ పై అయన పై జరిగిన ఈడి రైడ్స్ గురించి చెప్తాడు కావచ్చని తెలిపారు. ఏం చేస్తారో చేసుకోండి.. ఏం పిక్కుకుంటారో పిక్కుకోండని సంచలన వ్యాఖ్యలు చేశారు. గీ చిట్టి నాయుడు ఏం చేస్తాడు హౌల గాళ్ళకి భయపడుతానా అని కీలక వ్యాఖ్యలు చేశారు. చిల్లర కేసు పెట్టీ జైలుకి పంపిస్తారు కావచ్చు అంతే.. అని అన్నారు. ఒర్జినల్ బాంబులకి భయపడలేదు.. గీ సుతిల్ బాంబులకు భయపడనని కేటీఆర్ అన్నారు. జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు. జగిత్యాల ఎంఎల్ఏ రాజకీయ వ్యబిచారి, పార్టీ మారిన 10 మంది రాజకీయ వ్యబిచారీలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో కాంగ్రెస్ నాయకులే కాంగ్రెస్ నాయకులే చంపుకుంటున్నారని తెలిపారు. మోడీ నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
Vikarabad Farmers: దుద్యాల మండలంలో ఉద్రిక్తత.. ఫార్మా భూ రైతుల ఆందోళన..

Exit mobile version