సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్‌లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది.సిరిసిల్ల కలెక్టర్ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఖండించింది. సివిల్ సర్వీసెస్‌లో ముఖ్యమైన పదవిలో ఉన్న అధికారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడటం తగదని వ్యాఖ్యానించింది. ఓ జిల్లా కలెక్టర్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని కించపరిచేలా మాట్లాడటాన్ని తప్పుబట్టింది. కేటీఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని.. సిరిసిల్ల కలెక్టర్‌కు కేటీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
Read Also: Raja Singh: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్.. ఏమన్నారంటే?
మరోవైపు.. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై కేటీఆర్ చేసిన అవమానకరమైన, నిరాధార ఆరోపణలను.. దుర్భాషలాడటాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. కేటీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జిల్లా కలెక్టర్ విధులను రాజకీయంగా వక్రీకరించే ప్రయత్నాలు సరికాదని తెలిపింది. సివిల్ సర్వీస్ అధికారిపై చేసిన విమర్శలు, నిరాధార ఆరోపణలు ప్రజస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని స్పష్టం చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల గౌరవం కాపాడటానికి తాము అండగా నిలబడతామని తెలిపింది. కేటీఆర్ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని కోరింది. వ్యవస్థల గౌరవాన్ని, రాజ్యాంగం ద్వారా కల్పించిన న్యాయబద్ధతను గౌరవించే విధంగా వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం సూచించింది.
Read Also: YS Jagan: అదానీ వ్యవహారంపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. వారిపై పరువునష్టం దావా..!