NTV Telugu Site icon

Harish Rao: రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు..

Harish Rao

Harish Rao

వేములవాడ రాజన్న మీద ఒట్టు పెట్టి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు.. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ప్రజల ఇలవేల్పు పైన సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని.. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రైవేట్‌లో ఇప్పటికే అమ్ముకున్నారని ఆరోపించారు. పాలన చేతగాక బోనస్ అన్నారని.. ఏది లేదనీ, మహారాష్ట్రకు వెళ్లి బోనస్ ఇస్తున్నామని మాయమాటలు చెప్పారని సీఎం రేవంత్ రెడ్డిపై దుయ్యబట్టారు. కనీసం సన్నాలకైన బోనస్ లేదని విమర్శించారు.

Read Also: Konda Surekha: వరంగల్ మార్కెట్ లో ఓ మాఫియా దందా చేస్తోంది.. కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు

రాజన్నను వేడుకున్న రైతులకు న్యాయం జరగాలని.. రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం చేయాలని కోరుకున్నట్లు హరీష్ రావు తెలిపారు. ప్రపంచంలో దేవుళ్లపై ఒట్లు పెట్టిన వారిలో రేవంత్ రెడ్డి మొదటివాడని, దేవుళ్ళపై ఒట్లు పెట్టి కుడా ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. రూ. 2 లక్షల పైనా ఉన్న వారికి ఎందుకు నిబంధన పెట్టారని.. చేసిన రుణమాఫీ పాక్షికంగా చేశావు.. నిబంధనలు, కుంటి సాకులతో పూర్తి స్థాయిలో చేయలేదని హరీష్ రావు పేర్కొన్నారు. రాజన్న దగ్గరికి వచ్చి తప్పయింది అని వేడుకోమని రేవంత్ రెడ్డికి సూచించారు.

Read Also: TFCC : ఘనంగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం

కేసీఆర్ పైనా మట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, 11 నెలల్లో ఏం కోల్పోయారో, ఏం వచ్చిందో మాట్లాడుకుందామా తాను చర్చకి సిద్ధమన్నారు. అన్ని రంగాల్లో అన్ని బంద్ అయ్యాయని.. విద్యార్థులు రోజు ఎక్కడో ఒక చోట ధర్నాలు చేస్తున్నారని హరీష్ రావు తెలిపారు. రైతు బంధు, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరలు, పోలీసుల కుటుంబాలు రోడ్లపై వచ్చారని.. నేతన్న ఆత్మహత్యలు పెరిగాయని.. పాలమురు ప్రాజెక్టు ఆగిపోయిందని.. దళిత బంధు, బీసీ బంధు కోల్పోయారని పేర్కొన్నారు. జర్నలిస్ట్‌లు హక్కులు కోల్పోయారని.. నాలుగేళ్ల కాలంలో నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి మాత్రమే వచ్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ వంద ఏళ్ళు ముందుకి తీసుకెళ్తే నీవు వెనక్కి తీసుకుపోతున్నావని ఆరోపించారు. ఎటువంటి నిబంధన లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.