రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని మున్నూరు కమ్యూనిటీ కళ్యాణ మండపానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎములాడ, కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాలను అభివృద్ధి చేస్తానని తెలిపారు. కసితో ప్లాన్ ప్రకారం ఆలయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. పార్టీలకు సంబంధం లేని వ్యక్తినే కుల సంఘాల బాధ్యులుగా నియమించాలని బండి సంజయ్ తెలిపారు. రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
Read Also: BMW Hit-And-Run Case: ముంబై హిట్ అండ్ రన్ కేసు.. 72 గంటల తర్వాత నిందితుడి అరెస్ట్..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దక్షిణ కాశీ వేములవాడకు విచ్చేసిన నేపథ్యంలో ఎములాడ రాజరాజేశ్వర ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత ఇంకా పెరిగిందని బండి సంజయ్ చెప్పారు. ఎములాడ రాజన్నతో పాటు కొండగట్టు, ఇల్లంతకుంట ఆలయాల అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ప్రకారం కసితో పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. జై శ్రీరామ్ అనేటోల్లు నిజమైన మున్నూరు కాపులని అన్నారు. తాను మున్నూరు కాపు వ్యక్తినే.. మొన్నటి దాకా ఎవరు అనుకోలేదని చెప్పారు. ఇదిలా ఉంటే.. లోక్ సభ ఎన్నికల్లో తన గెలుపుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహకరించారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తానని బండి సంజయ్ తెలిపారు.
Read Also: Kathua Ambush: కథువా ఉగ్రదాడికి ప్రతీకారం తప్పదు.. పాక్‌కి భారత్ వార్నింగ్..