Aghori Arrested: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం జిల్లేల చెక్ పోస్ట్ దగ్గర నాగ సాధు అఘోరిని పోలీసులు అడ్డుకున్నారు. వేములవాడలోని శ్రీ రాజ రాజేశ్వరి దేవస్థానంలో ఉన్న దర్గాను కూల్చి వేస్తానంటూ ఇటీవల ఆయన ఛాలెంజ్ చేశారు. ఇందులో భాగంగానే, ఆ దర్గాను కూల్చి వేయడానికి బయలుదేరిన అఘోరిని.. తంగళ్ళపల్లి మండలం జిల్లేల గ్రామ శివారులోని జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకొని తిరిగి వెనక్కి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, అఘోరిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
Read Also: Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర ప్రధాన పూజారికి ‘‘బ్రెయిన్ స్ట్రోక్’’.. పరిస్థితి విషమం..
ఇక, సదరు అఘోరిని చూసేందుకు స్థానిక ప్రజలు భారీగా తరలి రావడంతో.. పరిస్థితులు ఉద్రిక్తతగా మారింది. తంగళ్ళపల్లి, సిరిసిల్ల పోలీసులు జిల్లేలకు చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకు వచ్చారు. అయితే, పోలీసులు అఘోరితో మాట్లాడడానికి ప్రయత్నించిన అతడు మాత్రం ఒప్పుకోక పోవడంతో చివరికి చేసేదేమీ లేక టోయింగ్ వ్యాన్తో కారును బంధించి హైదరాబాద్ మార్గంలో అఘోరీ కారును పోలీసులు తరలించారు.